Job Mela In Vijayawada: విజయవాడలో మెగా వికసిత్ జాబ్ మేళా
- విజయవాడలో మెగా వికసిత్ జాబ్ మేళా
- యువత నుండి విశేష స్పందన
- కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Job Mela In Vijayawada: విజయవాడ నగరంలో మెగా వికసిత్ జాబ్ మేళా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, ఇతర టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో 60 ప్రముఖ కంపెనీలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు అందించాయి. జాబ్ మేళా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, మన రాష్ట్రం కొన్ని కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ, మన అదృష్టం చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారన్నారు. ఆయనకు ఉన్న విజన్ 2020ను ఎవరూ నమ్మలేదు, కానీ.. అదే విజన్ ఇప్పుడు మన రాష్ట్రాన్ని ఐటీ రంగంలో ముందుకు తీసుకెళ్తుంది. హైదరాబాద్, అమరావతి నగరాలను నిర్మించిన ఘనత చంద్రబాబుదే అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ జాబ్ మేళా ద్వారా యువతకు మాత్రమే కాకుండా, పదో తరగతి చదివిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. జనవరి 5న MSME అవగాహన సదస్సు నిర్వహించి, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అవగాహన కల్పిస్తామని, ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి జాబ్ మేళాలను నిర్వహించడానికి కృషి చేస్తాం అని ఆయన అన్నారు.
Also Read: Nitish Kumar Reddy: తగ్గేదేలే.. ఆస్ట్రేలియాలో మొదటి సెంచరీతో అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డి
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. నాయకుడు చంద్రబాబు యువత అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించారని, ఈ మెగా వికసిత్ జాబ్ మేళా అదే ఆలోచనలో భాగం అని అన్నారు. మన నియోజకవర్గంలో ప్రతి యువతికి ఉద్యోగం కల్పించడమే మా లక్ష్యం అని, ఈ జాబ్ మేళా యువతకు మంచి అవకాశం అన్నారు. అలాగే ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. యువత కోసం ప్రత్యేకంగా జాబ్ మేళా నిర్వహించడం గతంలో ఎక్కడా చూడలేదు. ఇది విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని నిబద్ధతను చాటిచెప్పింది. గతంలో మన రాష్ట్రానికి అనేక ఐటీ కంపెనీలను తీసుకువచ్చిన చంద్రబాబు కృషి అద్భుతం అని అన్నారు. ఈ రోజు 3,000 మందికి ఉద్యోగాలు వచ్చేలా ఈ మేళా ఏర్పాటు చేయడం గొప్ప విషయం అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read: Tirumala Parakamani: తిరుమల పరకామణి సొమ్ముల స్వాహాపై పూర్తి విచారణ జరపాలన్న బీజేపీ నేతలు
ఇక ఈ మెగా వికసిత్ జాబ్ మేళాకు యువత నుండి విశేష స్పందన లభించింది. ఇప్పటివరకు 2,000 మంది ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోగా, 3,000 మంది ఆఫ్‌లైన్‌లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. యువతకు మరింత ఉపయుక్తమయ్యేలా ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఈ కార్యక్రమం యువతకు కొత్త అవకాశాలను అందించడమే కాకుండా, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!