AP Cabinet Key Decisions: సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. మంత్రివర్గ సమావేశంలో 14 అంశాల ఎజెండాలకు ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనపై కేబినెట్‌లో చర్చ జరిగింది. జనవరి 8న ప్రధాని మోడీ వైజాగ్ రానున్నారు. వైజాగ్ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని పర్యటనకు భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఇక, కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత.. అందులో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు మంత్రి కొలుసు పార్థసారథి..
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
తిరుపతిలో ఈఎస్ఐ ఆస్పత్రిలో 100 పడకలు చేయడానికి కేబినెట్ నిర్ణయించిందన్నారు.. అమరావతిలో వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నిధులతో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. కొత్త టెండర్లతో పనులు జరుగుతాయని వివరించారు మంత్రి పార్థసారథి.. A M R U D A చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం లో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు . పారిశ్రామిక వేత్తలు తమ పనులు సగంలో ఆపి వెళ్లిపోయారు. రుణాలు ఇచ్చే బ్యాంక్‌లు కూడా గత ప్రభుత్వంలో ఇవ్వలేదన్నారు.. ఇక, కడప జిల్లాలో టీడీపీ కార్యాలయానికి స్థలం కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.. రెవెన్యూ సదస్సులకు సంబంధించి కేబినెట్‌లో చర్చ జరిగింది. 22 ఏ ల్యాండ్ సర్వే వివాదాలపై చర్చ జరిగింది.. వీటిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు.. రెవెన్యూశాఖ సమస్యల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ శాఖలో ఉన్న సమస్యలకు సంబంధించిన కమిటీ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది.. ఆర్ధిక క్రమశిక్షణ సరిగ్గా లేక గత ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో కి నెట్టిందని ఆరోపించారు.. ఇక, నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం.. వచ్చే విద్యాసంవత్సరం లో డీఎస్సీ నిర్వహణకు సిద్ధం అయ్యింది.. డీఎస్సీ నిర్వహనతో పాటు.. తల్లికి వందనం కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉంటుందని తెలిపారు మంత్రి పార్థసారథి..