ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది డాకు మహారాజ్. ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ‘రిలీజ్ రోజు అనగా జనవరి 12 తెల్లవారుజామున 4 గంటల బెనిఫిట్ షో టికెట్ ధర రూ.500 గా నిర్ణయించారు.అలాగే రెగ్యులర్ షోస్ కు మల్టీప్లెక్స్ టికెట్ ధరపై పై రూ. 135, సింగిల్ స్క్రీన్‌లపై రూ. 110 పెంచుతూ జీవో జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ కు కూడా బెన్ఫిట్ షోస్ రూ.600పెంచడంతో పాటు రెగ్యులర్ షోస్ కు ముల్టీప్లెక్స్ లో రూ. 135, సింగిల్ స్క్రీన్‌లపై రూ. 110 పెంచుకోమని ఆదేశాలు జారీచేసింది ఏపీ ప్రభుత్వం.
Also Read : DaakuMaharaaj : డాకు మహారాజ్ ఇప్పటికీ RR వర్క్ పెండింగ్
అయితే డాకు మహారాజ్, గేమ్ చేంజర్ సినిమా టికెట్ ధరలు పెంచటాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. సినిమాలకు ఇలా బెన్ ఫిట్ షో అనుమతి ఇవ్వటం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని ప్రస్తావించారు పిటిషనర్. హైదరాబాద్ లోని సంధ్య ధియేటర్ ఘటనలో ఒకరు మృతి చెందారని, ఆ కేసుకు సంబంధించి FIR కాపీని జత చేసారు పిటిషనర్. నిబంధనలకు విరుద్ధంగా ఏపీలో టికెట్ ధరలు పెంచారని పిటిషన్ లో పేర్కొన్నారు. నేడు విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు ఏ తీర్పుఇస్తుందోననే టెన్షన్ మేకర్స్ లో నెలకొంది.