Motion Sickness: కొందరు ప్రయాణం చేయడానికి భయపడుతుంటారు. వీరు వాహనాల్లోకి ఎక్కిన వెంటనే వాంతులు చేసుకోవడం ప్రారంభమవుతోంది. దీన్ని ‘మోషన్ సిక్‌నెస్’గా పిలుస్తుంటారు. మైకం, వికారం, వాంతులు, చెమటలు పట్టడం వంటివి దీనికి లక్షణాలు. అయితే ప్రయాణించేటప్పుడు ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే మన భారతీయ ఆయుర్వేద వైద్యంలో మంచి నివారణలు ఉన్నాయి. వంటింటి చిట్కాలను వాడి ఈ మోషన్ సిక్‌నెస్ లేదా ట్రావెల్ సిక్‌నెస్‌ని దరికి రానీవ్వకుండా చేయొచ్చు.
1) అల్లం:
చాలా ఏళ్ల నుంచి వాంతులు, వికారానికి అల్లాన్ని మంచి ఔషధంగా వాడుతున్నారు. అల్లం టీ, అల్లం క్యాండీలు, అల్లం క్యాప్సూల్ రూపంలో తీసుకోవచ్చు. వాంతులను తగ్గించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
2) పుదీనా:
పుదీనా కడుపుకు ప్రశాంతతనిస్తుంది. జీర్ణక్రియకు సమహాయపడుతుంది. ఉబ్బరం, అజీర్ణాన్ని క్యూర్ చేస్తుంది.
3) సోంపు గింజలు:
సోంపు గింజలు కూడా మోషన్ సిక్‌నెస్‌ని తగ్గించడానికి సాయపడుతాయి. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
4) యాలకులు:
యాలకుల్లో ఉండే కార్మినేటివ్ గుణాలు అజీర్ణం, ఉబ్బరం, వికారాన్ని తగ్గిస్తాయి. యాలకుల టీ తాగడం వల్ల మోషన్ సిక్‌నెస్‌ని అరికట్టవచ్చు.
5) అశ్వగంధ:
మన ఆయుర్వేదంలో అశ్వగంధకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది శరీరంపై ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడానికి సాయపడుతుంది. గోరువెచ్చని పాలల్లో లేదా నీటిలో అశ్వగంధ పొడిని తీసుకోవచ్చు.
6) త్రిఫల:
త్రిఫల అనేది మూడు భారతీయ పండ్ల మిశ్రమం.. అమలకీ, బిభిటాకీ, హరితకీ. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగుల కదలికల్ని ప్రోత్సహిస్తుంది. వికారం తగ్గడంలో సాయపడుతుంది.
7) ఉసిరి:
ఉసిరిలో విటమిన్-సీ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
8) బ్రహ్మీ:
బ్రహ్మీ అనేది ఆయుర్వేద మూలిక. ఇది ఆందోళనను తగ్గించే మూలకం. ఒత్తిడి తగ్గిస్తుంది. దీని వల్ల ట్రావెల్ సిక్‌నెస్ లక్షణాలు తగ్గుతాయి.
9) త్రికటు:
త్రికటు అనేది ఎండుమిర్చి, పొడవాటి మిరియాలతు, అల్లం కలయిక. ఇది జీర్ణక్రియను పెంచి వికారాన్ని తగ్గిస్తుంది. త్రికటును వంటల్లో మసాలాగా తీసుకోవచ్చు.
10) ధ్యానం, శ్వాస వ్యాయామం:
ధ్యానం, శ్వాస వ్యాయామాలు సాధన చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఇది ప్రయాణాల్లో ఎదురయ్యే శారీరక ఇబ్బందులను తప్పిస్తుంది. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అయితే ఈ ఆయుర్వేద నివారణలు కొంతమంది మోషన్ సిక్నెస్ తగ్గిండచంలో సాయపడుతాయి. ఏదైనా చికిత్స తీసుకునే ముందు అర్హుడైన ఆయుర్వేద వైద్యుడిని కలవడం మంచిది.