Udaynidhi Stalin: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు పాలైన ఉదయనిధి స్టాలిన్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. శనివారం అహ్మదాబాద్ వేదికగా ఇండియా-పాకిస్తాన్ వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఔటై వెళ్తున్న క్రమంలో స్టేడియంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా ‘జైశ్రీరాం’ నినాదాలు చేశారు. అయితే దీనిపై మాట్లాడిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్.. జైశ్రీరాం నినాదాలను ఖండించారు.
దీనికి సంబంధించిన వీడియోను తన ఎక్స్(ట్విట్టర్) అకౌంట్ లో పోస్ట్ చేసిన ఉదయనిధి..‘‘ భారతదేశం క్రీడాస్పూర్తి, ఆతిథ్యానికి ప్రసిద్ధి చెందింది. అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో పాక్ ఆటగాళ్లకు ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని, క్రీడలు నిజమైన సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా, దేశాలను ఏకం చేసే శక్తి ఉండాల, విద్వేషాలను వ్యాప్తి చేయడానికి సాధనంగా వాడొద్దు’’ అని వ్యాఖ్యానించారు.
Read Also: Motion Sickness: ప్రయాణాల్లో తరుచు వాంతులు అవుతున్నాయా..? ఈ 10 ఆయుర్వేద చిట్కాలను ట్రై చేయండి..
ఉదయనిధిపై బీజేపీ మరోసారి ఫైర్ అయింది. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఎక్స్(ట్విట్టర్)లో ఉదయనిధిపై సెటైర్లు వేశారు. ఉదయనిధిని ఉద్దేశిస్తూ..‘‘ ద్వేషపూరిత డెంగ్యూ మలేరియా దోమ(ఉదయనిధి) విషాన్ని వ్యాప్తి చేయడానికి బయటకు వచ్చింది. ఒక మ్యాచ్ ఆపి నమాజ్ చేసినప్పుడు మీకు ఇబ్బంది కలగలేదు, మన భగవంతుడైన శ్రీరాముడిని విశ్వంలో ప్రతీమూలలో ఉన్నారు. జైశ్రీరాం అని జపించండి’’ అంటూ పోస్ట్ చేశారు.
కొన్ని రోజల క్రితం ఇలాగే సతనాన ధర్మంపై మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతనధర్మ డెంగ్యూ, మలేరియా లాంటిదని దాన్ని తడిచేయాలని అన్నారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ రచ్చకు కారణమయ్యాయి. బీజేపీ ఉదయనిధిని టార్గెట్ చేశాయి. ఇండియా కూటమిలో భాగంగా డీఎంకే భాగస్వామి కావడంతో, కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ బీజేపీ విమర్శలు గుప్పించింది.