LinkedIn: ప్రముఖ బిజినెస్-ఎంప్లాయ్‌మెంట్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం, మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలో పనిచేస్తున్న లింక్డ్‌ఇన్ మరోసారి తన ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించింది. గతంలో ఇలాగే కొంత మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన లింక్డ్‌ఇన్ రెండో రౌండ్‌లో ఉద్యోగులను తొలగించింది. ఇంజనీరింగ్, టాలెంట్, ఫైనాన్స్ టీముల్లోని 668 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోబోతున్నారు. సోషల్ మీడియా నెట్‌వర్క్ నియామకం మందగించడం ప్రస్తుత ఉద్యోగ కోతలకు కారణమవుతోంది.
20,000 మంది సిబ్బందిలో 2.5 మంది ఉద్యోగులను లేఆఫ్ ప్రభావితం చేస్తోంది. ఆర్థిక పరిస్థితి మందగించడం, ఆర్థిక మాంద్యం భయాల వల్ల ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఉద్యోగుల్ని తీసేశాయి. గ్లోబల్ రేంజ్ ప్రముఖ కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ వంటి కంపెనీల వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
టెక్ కంపెనీలను ఆర్థికమాంద్యం భయాలు కమ్మేయడంతోనే ఇలా వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గతేడాది నవంబర్ నుంచి ప్రారంభమైన ఈ లేఆఫ్స్ పర్వం ఇంకా కొనసాగుతోంది. గతేడాది నుంచి గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 12000 మంది ఉద్యోగులను ప్రపంచవ్యాప్తంగా తొలగించింది. గూగుల్ మాత్రమే కాకుండా ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా గతేడాది నవంబర్ లో 11,000 మందిని, అంటే తన కంపెనీ వర్క్ ఫోర్సులో 13 శాతాన్ని తొలగిస్తున్నట్లు తెలిపింది. అమెజాన్ 18,000 మందిని, మైక్రోసాఫ్ట్ 10,000 మందిని, ట్విట్టర్ తన ఉద్యోగుల్లో 50 శాతం మందిని తొలగించాయి.