Israel-Hamas War: ఇజ్రాయిల్ చేరుకున్న జో బైడెన్.. హమాస్ ఐసిస్ కన్నా దారుణంగా ప్రవర్తించింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం తీవ్రమవుతోంది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై క్రూరమైన దాడి చేశారు. ఈ దాడిలో 1400 మంది చనిపోయారు. 199 మందిని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయిల్, హమాస్ ని పూర్తిగా అతుముట్టించేలా గాజా స్ట్రిప్‌పై భీకరదాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే మంగళవారం గాజాలోని ఓ ఆస్పత్రిపై జరిగిన దాడిలో 500 మంది మరణించారు.
ఈ నేపథ్యంలో ఈ రోజు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయిల్ పర్యటనకు వచ్చారు. యుద్ధంలో ఇజ్రాయిల్‌కి సంఘీభావం ప్రకటించేందుకు ఆయన ఇజ్రాయిల్ చేరుకున్నారు. టెల్ అవీవ్ చేరుకున్న జో బైడెన్‌ని ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ బెన్, ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు స్వాగతం పలికారు. గాజా యుద్ధంపై నెతన్యాహూ, బైడెన్ చర్చించనున్నారు. ‘‘ నేను ఈరోజు ఇక్కడ ఉండాలనుకున్నాను, ప్రపంచ, ఇజ్రాయిల్ ప్రజలు అమెరికా ఏ వైపున ఉందో తెలుసుకోవడానికి వచ్చాను’’ని బైడెన్ వ్యాఖ్యానించారు.
Also Read
- Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
Read Also: Telangana BJP: అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వండి.. పవన్ ను కోరిన తెలంగాణ బీజేపీ..!
వందలాది మహిళలను, పిల్లలను చంపేసి హమాస్ దౌర్జన్యాలను ఆయన ఖండించారు. ‘‘హమాస్ ఐసిస్ కన్నా క్రూరంగా దారుణాలకు పాల్పడింది. హమాస్ పాలస్తీనాకు ప్రాధాన్యత వహించదు. పాలస్తీనా ప్రజలకు బాధలను మాత్రమే హమాస్ తీసుకువచ్చిందనేది గుర్తుంచుకోవాలి’’ అని ఆయన అన్నారు.
మరోవైపు హమాస్‌ను అంతం చేసేదాకా విశ్రమించమని ఇజ్రాయిల్ ఇప్పటికే తేల్చి చెప్పింది. వైమానికి దాడులతో గాజా స్ట్రిప్ పై విరుచుకుపడుతోంది. ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో గాజాలోని ప్రజలు 3000 మంది మరణించారు. ఉత్తరగాజాలోని ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా ఇజ్రాయిల్ హెచ్చరించింది. త్వరలోనే బందీలుగా ఉన్న ప్రజలను విడిపించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) పదాతిదళం భూతల దాడులు చేసేందుకు సిద్ధంగా ఉంది.
US President Joe Biden arrives in Tel Aviv, Israel amid Israel-Hamas conflict.
(Pics Source: Reuters) pic.twitter.com/47CiKIOdo9
— ANI (@ANI) October 18, 2023
తాజావార్తలు
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
ట్రెండింగ్
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!