Egypt: ఈజిప్టు రాణి సమాధిలో 5000 ఏళ్ల నాటి వైన్ లభ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Egypt: ఈజిఫ్ట్ చరిత్ర ఎంతో ప్రత్యేకమైంది. అక్కడి ఫారో రాజుల పరిపాలన, మమ్మీలు ఇలా అనేక వింతలకు పుట్టినిల్లు. చాలా మంది రాజులు, రాణులు సమాధుల్లో ఎంతో సంపద లభించడం మనం చూశాం. టూటెన్‌కామూన్ రాజుకు సంబంధించిన శాపం, అతని సమాధి నుంచి లభించిన వెలకట్టలేదని సంపద గురించి విన్నాం. ఇలా చాలా సమాధుల్లో అనేక అపురూప వస్తువలు లభించాయి. చనిపోయిన తర్వాత మమ్మీగా మార్చిన అనంతరం వారికి ఇష్టమైన వస్తువుల్ని వారి సమాధుల్లో ఉంచడం ఆనవాయితీ. కొన్ని సమాధుల్లో లభించిన వేల ఏళ్ల నాటి తేనె ఇప్పటికీ అలాగే చెడిపోకుండా ఉంది.
తాజాగా ఈజిప్టు రాణి క్వీన్ మెరెట్-నీత్ సమాధిని కనుగొన్నారు. దాదాపుగా 5000 వేల ఏళ్ల నాటి ఈమె సమాధిలో ఆనాటి సీల్డ్ ‘వైన్’ సీసాలను కనుగొన్నారు. ఈమెను ఈజిప్టును పాలించిన మొదటి మహిళా ఫారో అని నమ్ముతారు. వియన్నా విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తే శాస్త్రవేత్త క్రిష్టియానా కోహ్లెర్ నేతృత్వంలోని జర్మన్-ఆస్ట్రియన్ టీం అబిడోస్ లోని క్వీన్ మెరెట్-నీత్ సమాధిని తవ్వుతుండగా.. వారు పెద్ద జాడీల్లో వైన్ ని కనుగొన్నారు.
Also Read
- Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
Read Also: Kim Jong Un: కిమ్ పైశాచికం.. పిరానా చేపలకు ఆహారంగా వేసి జనరల్ హత్య..
సమాధిలో చాలా సేంద్రీయ అవశేషాలు, ద్రాక్ష విత్తనాలు, స్పటికాలను కొనుగొన్నామని, ప్రస్తుతం వాటిని శాస్త్రీయంగా విశ్లేషిస్తున్నామని పరిశోధకులు చెప్పారు. సమాధి కాంప్లెక్స్ మధ్యలో రాణి సమాధి ఉంటే.. దాని చుట్టూ సభికులు, సేవకుల ద్వితీయ సమాధులు కూడా ఉన్నాయి. ఈ పురాతన వైన్ జాడీల్లో ఇప్పటికీ కొన్ని సీల్డ్ చేయబడి ఉన్నాయి. నిజానికి మెరెట్-నీత్ రాణికి సంబంధించి చాలా విషయాలు మిస్టరీగా ఉన్నాయి. ఈజిప్టులో మొదటి రాజ శ్మశానవాటిక కలిగిన ఏకైక మహిళ ఇమే.
సమాధిలో దొరికిన శాసనాల ప్రకారం 3000 BCలో ట్రెజరీ వంటి ప్రభుత్వ శాఖను నిర్వహించినట్లుగా పరిశోధకులు నిర్దారించారు. ప్రస్తుత తవ్వకాలు ఆమె జీవిత కాలం, ఇతర విషయాలను వెలుగులోకి తెస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సమాధిలో మెరిట్-నీత్ సమాధి చుట్టూ 41 మంది సభికులు, సేవలకుల సమాధులు ఉన్నాయి. కాల్చని మట్టి ఇటుకలు, మట్టి, కలపతో నిర్మించారు.
తాజావార్తలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి