France: ఫ్రాన్స్‌లో హై అలర్ట్ నెలకొంది. దాడులు జరుగుతాయనే బెదిరింపుల నేపథ్యంలో ప్రభుత్వం అలర్టైంది. పారిస్ సమీపంలోని 6 ఎయిర్ పోర్టులను అధికారులు ఖాళీ చేయించారు. లిల్లే, లియోన్, నాంటెస్, నైస్, టౌలౌస్, బ్యూవైస్ విమానాశ్రయాలను అత్యవసరంగా ఖాళీ చేయించారు. బుధవారం ఈమెయిల్ ద్వారా దాడి జరుగుతుందని బెదిరింపులు వచ్చాయి. ఫ్రాన్స్ డీజీఏసీ ఏవియేషణ్ అథారిటీ ప్రతినిధి మాట్లాడుతూ.. లిల్లే, లియోన్, టౌలౌస్, బ్యూవైస్ ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయని ధృవీకరించారు. బెదిరింపుల నేపథ్యంలో కొన్ని విమానాలను దారి మళ్లించారు.
Read Also: Himanta Biswa Sarma: రాహుల్ గాంధీ నిరక్షరాస్యుడైన పిల్లవాడు.. హిమంత సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే ఇటీవల ఫ్రాన్స్ ఉత్తర ప్రాంతంలో ఓ ఇస్లామిక్ ఉగ్రవాది ఓ హై స్కూల్ లో కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఓ టీచర్ మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మతపరమైన నినాదాలు చేస్తూ సదరు వ్యక్తి దాడులు చేశాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై ఫ్రాన్స్ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ దాడికి ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంతో సంబంధం ఉందని అక్కడి అంతర్గత మంత్రి వెల్లడించారు.
దాడి జరిగిన ప్రాంతాన్ని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ సందర్శించారు. దాడిలో మరణించిన వ్యక్తి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. అంతకుముందు రోజు మాట్లాడిన మక్రాన్ ఇజ్రాయిల్-హమాస్ యుద్ధాన్ని ఇంటి వరకు తీసుకురావద్దని సూచించారు. మరోవైపు పాలస్తీనా హమాస్‌కి మద్దతుగా ఫ్రాన్స్ లోని పలు ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు జరిగాయి. వీటిని ఫ్రాన్స్ పోలీసులు అడ్డుకున్నారు.