కేంద్ర ప్రవేశపెట్టిన ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ ‘ అగ్నిపథ్ ’పై దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. బీహార్,తెలంగాణ, యూపీ,హర్యానా, తమిళనాడు, గుజరాత్ ఇలా పలు రాష్ట్రాల్లో ఆర్మీ ఆశావహులు, యువత ఆందోళనలు చేశారు. బీహార్, తెలంగాణల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా బీహార్ లో రైల్వే ఆస్తులే లక్ష్యంగా పలు రైళ్లకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. స్టేషన్లను ధ్వసం చేశారు. తెలంగాణ సికింద్రాబాద్లో కూడా హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఆందోళనల్లో ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఇదిలా ఉంటే […]
ఆఫ్ఘనిస్తాన్ లో శనివారం సిక్కులను, హిందువులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడి చేశారు. కాబూల్ లోని బాగ్-ఇ బాలా ప్రాంతంలో గురుద్వారా కార్తే పర్వాన్ లక్ష్యంగా ఉగ్రవాదులు అటాక్ చేశారు. ఈ దాడిలో ఒక సిక్కుతో పాటు ఇద్దరు వ్యక్తులు మరణించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ముగ్గుర్ని అక్కడి భద్రతాబలగాలు హతమార్చాయి. గురుద్వారాలో శనివారం ఉదయం 30 మంది వరకు ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు గ్రెనేడ్స్ తో విరుచుకుపడ్డారు. గ్రెనెడ్ విసరడంతో గురుద్వారాలో మంటలు చెరేగాయి. […]
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. గత మూడు నెలల కాలం నుంచి తగ్గుతూ వస్తున్న కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. పది రోజుల క్రితం వరకు రోజూ వారీ కేసుల సంఖ్య కేవలం 3 వేలకు దిగువనే ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం కేసుల సంఖ్య 10 వేలను దాటుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు పెరుగుతోంది. దీంతో మళ్లీ ప్రజల్లో కరోనా భయాలు నెలకొన్నాయి. ఫోర్త వేవ్ తప్పదా..? అనే అనుమానాలు […]
శ్రీలంక సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అక్కడ ప్రభుత్వం మారినా.. పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఇప్పటికీ జనాలు తీవ్ర ఇంధన కొరత, నిత్యావసరాల కొరతను ఎదుర్కుంటూనే ఉన్నారు. ఇక ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇంధనానికి డబ్బులు చెల్లించేందుకు శ్రీలంక వద్ద విదేశీ మారక నిల్వలు లేవు. దీంతో దేశంలో ట్రాన్స్ పోర్ట్ , విద్యుత్ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. ఇదిలా ఉంటే ఇంధనానికి డబ్బులు చెల్లించేందుకు డాలర్లు లేకపోవడంతో పబ్లిక్ ట్రాన్స్ ఫోర్ట్ వ్యవస్థ దాదాపుగా నిలిచిపోయింది. […]
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీమ్ పై నిరసనలు వ్యక్తం అవుతున్న తరుణంలో ఈ పథకంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ. అగ్నిపథ్ పథకాన్ని ఓ దశాదిశ లేని పథకంగా అభివర్ణించారు. ఈ వివాదాస్పద పథకాన్ని ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తడి తీసుకువస్తామని.. కాంగ్రెస్ పార్టీ యవతకు సపోర్ట్ గా నిలబడుతుందని సోనియాగాంధీ వెల్లడించారు. సోనియా గాంధీ లేఖను మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రిక్రూట్మెెంట్ […]
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా కర్ణాటక రాజధాని బెంగళూర్ ఖ్యాతి గడించింది. భారత దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగం ఎదుగుతున్న నగరాల్లో ఇది ఒకటి. ఇప్పటికే ప్రపంచ నగరాల్లో ఆల్ఫా సిటీల్లో ఒకటిగా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా బెంగళూర్ లోని కెంపెగౌడ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు ప్రతిష్టాత్మక అవార్డు పొందింది. 2022 స్కైట్రాక్ వరల్డ్ ఎయిర్ పోెర్ట్ అవార్డ్స్ లో కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ దక్షిణాసియాలోనే అత్యుత్తమ రిజినల్ ఎయిర్ పోర్టుగా […]
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఉమ్మడి అభ్యర్థిని నియమించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నప్పటికీ.. అడుగు కూడా ముందుకు పడటం లేదు. విపక్షాలు అనుకుంటున్న అభ్యర్థులు క్రమంగా తాము పోటీలో ఉండబోవడం లేదని చెబుతున్నారు. గతంలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ నేత, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ ను అనుకున్నప్పటికీ.. ఆయన నేను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. దీంతో విపక్షాలు మరికొన్ని పేర్లను తెరపైకి తీసుకువచ్చాయి. తాజాగా శరద్ పవార్ […]
అగ్నిపథ్ స్కీమ్ పై తీవ్ర వ్యతిరేఖత రావడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్నివీరులకు మరిన్ని సడలింపులు ఇస్తోంది. తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లో త్రివిధ దళాధిపతులు సమావేశం అయ్యారు. దేశంలో ‘ అగ్నిపథ్ ’పై జరుగుతున్న ఆందోళన గురించి చర్చించారు. అగ్నిపథ్ కింద కేవలం నాలుగేళ్ల కాలపరిమితికే ఆర్మీలో చేర్చుకోవడంతో పాటు 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకు వయసు ఉన్నవారిని మాత్రమే తీసుకోవాలని […]
ఓ విడాకుల కేేసులో కర్ణాటక హైకోర్ట్ సంచనల తీర్పు వెల్లడించింది. వివాహాన్ని రద్దు చేసుకున్నతర్వాత మహిళకు సంబంధించి వస్తువులను ఆమె భర్త తన వద్ద ఉంచుకోలేదరని తీర్పు వెల్లడించింది. ముంబైకి చెందిన వ్యక్తి తనపై మాజీ భార్య చేసిన ఫిర్యాదును బెంగళూర్ కోర్ట్ లో సవాల్ చేశాడు. ఈ కేసు విచారణ సందర్భంలో హైకోర్ట్ ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు వ్యక్తికి మహిళకు 1998లో డిసెంబర్ లో వివాహం జరిగింది. వివాహ సమయంలో ‘ స్త్రీ ధాన్ […]
రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారని.. కాంగ్రెస్ పార్టీకి ఒకటి కాదు పది ఛాన్సులు ఇచ్చామని అయినా అభివృద్ధి జరగలేదని.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు మంత్రి కేటీఆర్. కోల్లాపూర్ లో జరిగిన సభలో ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాలం చెల్లిన మందులాంటిది కాంగ్రెస్ అని.. ఎలా నమ్మాలని ప్రశ్నించారు. అనాలోచిత విధానాలతో దేశాన్ని రావణకాష్టంలా మార్చింది బీజేపీ అని, స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తెస్తామని చెప్పారని.. మాట […]