నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్ గా ఐపీఎస్ అధికారి దినకర్ గుప్తాను నియమించింది కేంద్ర ప్రభుతం. పంజాబ్ మాజీ డీజీపీ అయిన దినకర్ గుప్తాను ఎన్ఐఏ బాస్ గా నియామకాాల కమిటీ( ఏసీసీ) గురువారం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1987 బ్యాక్ పోలీస్ సర్వీస్ కు చెందిన దినకర్ గుప్తా పంజాబ్ కేడర్ లో పనిచేశారు. గతేడాది ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ స్థానంలో సీఎంగా బాధ్యతలు తీసుకున్న చరణ్ జీత్ సింగ్ చన్నీ, […]
ఆకాశంలో ఖగోళ అద్భతం చోటు చేసుకోబోతోంది. వరసగా ఐదు గ్రహాలు దర్శనం ఇవ్వబోతున్నాయి. సాధారణంగా ఒకే సరళరేఖపై రెండు మూడు గ్రహాలు కనిపించడం మనం రెగ్యులర్ గా చూస్తునే ఉంటాం.. కానీ ఏకంగా ఐదు గ్రహాలతో పాటు చంద్రుడు కూడా ఒకే వరసలో కనిపించడం చాలా అరుదు. ఈ అరుదైన ఘటన జూన్ 23 నుంచి జూన్ 25 వరకు కనివిందు చేయనుంది. గ్రహాలు తమ కక్ష్యల్లో తిరుగుతున్న సందర్భంలో ఒకే వరస క్రమంలోకి రావడం చాలా […]
మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శివసేనతో పాటు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలో కాకపుట్టిస్తోంది. శివసేన కీలక నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే 35 మంది శివసేన ఎమ్మెల్యేలతో పాటు ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో అస్సాం రాజధాని గౌహతిలో క్యాంప్ ఏర్పాటు చేయడంతో రాజకీయ సంక్షోభం మొదలైంది. తన వర్గం ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు షిండే. శివసేన, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు […]
ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ నేత, మాజీ గవర్నర్ ద్రౌపతి ముర్మును ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. గురువారం వరసగా ప్రధానితో సహా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడితో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు ద్రౌపతి ముర్ముకు ఘనంగా స్వాగతం పలికారు. ఇదిలా ఉంటే రేపు (జూన్ 24)న […]
ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేఖంగా మరోసారి దేశవ్యాప్తంగా ట్విట్టర్ లో ‘బైబై మోదీ’ హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. గత ఎనిమిదేళ్ల పాలనలో మోదీ అవలంభిస్తున్న విధానాలపై నెటిజెన్లు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల తీసుకువచ్చిన ‘అగ్నిపథ్’ పథకంపై కూడా నెటిజెన్లు స్పందిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అగ్నిపథ్ పై చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. గత ఎనిమిదేళ్లలో ఉద్యోగాలకు సంబంధించి బీజేపీ ఇచ్చిన హామీలపై యూటర్న్ తీసుకుందని.. ద్రవ్యోల్భనం, దేశ జీడీపీ మొదలైన విషయాల్లో భారత్ […]
మహారాష్ట్రలో రాజీకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడి కూటమి ప్రభుత్వం కూలిపోయే స్థితికి చేరుకుంది. మహావికాస్ అఘాడీని లీడ్ చేస్తున్న శివసేన పార్టీలోనే చీలిక వచ్చింది. శివసేన కీలక నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే దాదాపు 35 మంది పైగా ఎమ్మెల్యేలతో అస్సాం గౌహతిలో క్యాంప్ పెట్టారు. శివసేన తన మూల సిద్ధాంతాలకు వ్యతిరేఖంగా వ్యవహిరిస్తోందని ఆరోపించారు. బీజేపీతో చేతులు కలపాలని ఉద్ధవ్ ఠాక్రేకు సూచించారు. అయితే మహారాష్ట్రలో ‘మహా’ […]
భారత్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్ కు వంత పాడుతూ.. తమ మనస్సు నిండా భారత వ్యతిరేఖతను నింపుకుంటున్నారు. తాజాగా అమెరికాకు చెందిన డెమెక్రాటిక్ కాంగ్రెస్ మహిళా సభ్యురాలు ఇల్హాన్ ఒమర్ మరోసారి తన భారత వ్యతిరేఖతను బయటపెట్టారు. మతస్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నారనే నెపంతో భారత్ ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. గత మూడేళ్లుగా డెమొక్రాటిక్ కాంగ్రెస్ మహిళ సభ్యులు రషీదా తాలిబ్, జువాన్ వర్గాస్, ఇల్హన్ ఒమర్ లు […]
మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల ‘మహా వికాస్ అఘాడీ’ కూటమి పతనం అంచున ఉంది. శివసేన సీనియర్ నేత, మంత్రి ఏక్ నాథ్ షిండేతో ఏకంగా 35 శివసేన ఎమ్మెల్యేలు ఉండటంతో మ్యాజిక్ ఫిగర్ తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే వారంతా తమకు ప్రస్తుతం ప్రభుత్వంపై నమ్మకం లేదని చెబుతూ.. శివసేన, బీజేపీతో చేతులు కలపాలని ఉద్ధవ్ ఠాక్రేకు అల్టిమేటం జారీ చేశారు. ఎమ్మెల్యేల అభిప్రాయం ఇదే అయితే తాము కూటమి నుంచి వైదొలుగుతామని ఎంపీ […]
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ‘మహా’ మలుపులు తిరుగుతోంది. శివసేనలో చీలిక రావడంతో అక్కడ మహా వికాస్ అఘాడీ ఉమ్మడి సర్కార్ కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే తన మద్దతు ఎమ్మెల్యేలతో అస్సాం రాజధాని గౌహతిలో మకాం వేశారు. తమకు ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వంపై నమ్మకం లేదని లేఖ కూడా విడుదల చేశారు ఎమ్మెల్యేలు. శివసేన నాయకుడు ఏక్ నాథ్ షిండే, సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై సంచలన ఆరోపణలు చేశారు. తమకు […]
ఈశాన్య రాష్ట్రాలు వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా అస్సాం, మేఘాలయ రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితం అయ్యాయి. అస్సాంలో వరదల వల్ల ఇప్పటి వరకు 54 లక్షల మంది ప్రభావితం అయ్యారు. తాజాగా గురువారం వరదల కారణంగా మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలో కురుస్తున్న వర్షాల కారణంగా పరిస్థితులు భయంకరంగా మారాయి. చాలా జిల్లాలు వరద తాకిడికి గురయ్యాయి. మొత్తం 36 జిల్లాల్లో 32 జిల్లాలు ముంపుకు గురయ్యాయి. వరదల వల్ల ఇప్పటి వరకు అస్సాంలో […]