Venu Goapl Reddy
Author- NTV Telugu-
Arunachal Pradesh Clash: భారత్-చైనా సరిహద్దు ఘర్షణలపై స్పందించిన అమెరికా..
US Reacted To India-China Border Clash: భారత్, చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో ఇరు దేశాల సైనికులు తలపడ్డారు. ఇరు దేశాల సైనికులు ఈ ఘర్షణల్లో గాయపడ్డారు. అయితే ఈ ఘటనలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు వెల్లడించింది. తవాంగ్ ప్రాంతం నుంచి ఇరుదేశాల బలగాలు వైదొలగడంపై బైడెన్ ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ వెల్లడించారు. వివాదాస్పద సరిహద్దుపై ఇరు దేశాలు ద్వైపాక్షికంగా… -
Congo: కాంగోలో వరద విలయం.. 120 మంది దుర్మరణం
Floods kill at least 120 in DRC capital Kinshasa: డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వరదలు విలయం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఈ ఆఫ్రికా దేశం అతలాకుతలం అవుతోంది. కాంగో రాజధాని కిన్షాసాలో రాత్రంతా కురిసిన వర్షం వల్ల చరిత్రలో ఎప్పుడూ లేని వరదలు వచ్చాయి. దీంతో జనజీవితం స్తంభించిపోయింది. దాదాపుగా 1.5 కోట్ల జనాభా ఉన్న కన్షాసా వరదల వల్ల దెబ్బతింది. నగరంలోని ప్రధాన రహదారులు మునిగిపోయాయి. వరదలు, భారీ వర్షాల వల్ల కొండచరియలు… -
Uttar Pradesh: అంత్యక్రియలకు డబ్బు లేక రోజుల తరబడి తల్లి మృతదేహంతోనే..
UP Man Hides Mother's Body In House For Days: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. తల్లి మరణించి రోజులు గడుస్తున్నా.. ఆమె మృతదేహంతోనే రోజుల తరబడి ఉన్న కుమారుడి వార్త వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని గుల్రిహా ప్రాంతంలో 45 ఏళ్ల వ్యక్తి మరణించిన తన తల్లి మృతదేహాన్ని రోజుల తరబడి ఇంట్లోనే దాచిపెట్టాడని పోలీసులు మంగళవారం వెల్లడించారు. తన వద్ద డబ్బులు లేకపోవడంతోనే తల్లి అంత్యక్రియలను నిర్వహించలేకపోయానని ఆ వ్యక్తి పోలీసులకు వెళ్లడించారు. అయితే సదరు వ్యక్తి మద్యానికి… -
Nuclear Fusion Breakthrough: కేంద్రక సంలీన చర్యలో కీలక ముందడుగు..శాస్త్రవేత్తల ప్రకటన
Historic Nuclear Fusion Breakthrough Announced: శాస్త్రవేత్తలు ఎన్నో దశాబ్ధాలుగా కేంద్రక సంలీన చర్య కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది కనుక సాధ్యం అయితే క్లీన్ ఎనర్జీ, తక్కువ రేడియేషన్ కలిగిన ఎనర్జీని ఉత్పత్తి చేయవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా చారిత్రాత్మక న్యూక్లియర్ ప్యూజన్ బ్రేక్ త్రూని ప్రకటించారు శాస్త్రవేత్తలు. యూఎస్ఏ కాలిఫోర్నియాలోని లారెన్స్ లివర్మోర్ నేషనల్ లాబొరేటరీ (ఎల్ఎల్ఎన్ఎల్) ఈ నెలలో నిర్వహించిన ఒక ప్రయోగంలో కేంద్ర సంలీన చర్యను నడిపించేందుకు అవసరం అయిన లేజర్ శక్తి కన్నా ఎక్కువ శక్తి ఉత్పత్తి అయిందని… -
Cisco: టెక్కీలకు షాక్.. ఉద్యోగుల తొలగింపు ప్రారంభించిన సిస్కో..
Cisco Joins Global Wave Of Tech Lay-Offs, Will Cut 4,000 Jobs: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు, ద్రవ్యోల్భనం, ఆదాయం తగ్గిపోవడవంతో టెక్ దిగ్గజాలు వరసగా తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో మరో టెక్ దిగ్గజ సంస్థ చేరింది. సిస్కో గత నెలలో 4000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. తాజాగా ఈ తొలగింపు ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో దాదాపుగా 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని అంచనాలు చెబుతున్నాయి. తాజాగా సిస్కో కంపెనీ… -
Cervical Cancer Vaccine: గుడ్ న్యూస్.. 4 నెలల్లో అందుబాటులోకి గర్భాశయ క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్
Cervical Cancer Vaccine Could Be Developed In India by April-May 2023: మహిళ మరణాలకు కారణం అవుతున్న కాన్సర్లలో సర్వికల్ క్యాన్సర్( గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) ఒకటి. దీన్ని అరికట్టేందుకు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంది భారత్. అయితే ఈ వ్యాక్సిన్ విషయంలో గుడ్ న్యూస్ చెప్పారు కోవిడ్ వర్కింగ్ గ్రూప్, నేషనల్ టెక్నికల్ అడ్వైసరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ చీఫ్ డాక్టర్ అరోరా. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కు కారణం అవుతున్న హ్యూమన్ పాపిల్లోమా వైరస్(హెచ్‌పీవీ) నివారణకు సెర్వవాక్ వ్యాక్సిన్ అభివృద్ధి… -
Nitish Kumar: తేజస్వీ యాదవ్‌కు అధికారం.. నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు..
Nitish Kumar hints at power transfer to Tejashwi Yadav in future: బీజేపీ పొత్తును కాదని.. జేడీయూ అధినేత, బీహాార్ సీఎం నితీష్ కుమార్, మరోసారి లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో జతకట్టారు. బీజేపీతో పొత్తు తెగదెంపులు చేసుకుని, ఆర్జేడీతో కలిసి మహాఘటబంధన్ కూటమిని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే సీఎం నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కు అధికార బదలాయింపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
UK: రష్యా, ఇరాన్ దేశాలపై యూకే కొత్త ఆంక్షలు..
UK Announces New Sanctions Against Russia, Iran: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తీరును తప్పపడుతున్నాయి వెస్ట్రన్ దేశాలు. ఇప్పటికే రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికాతో పాటు పలు వెస్ట్రన్ దేశాలు పలు ఆంక్షలు విధించాయి. ఇటీవల రష్యా ఆయిల్ కొనుగోలుపై ప్రైజ్ క్యాప్ విధించాయి. ఈ ప్రైజ్ క్యాప్ తో బ్యారెల్ చమురును కేవలం 60 డాలర్లకు మాత్రమే కొనుగోలు చేయాలి. కాదని మరే దేశమైనా అంతకుమించి ధర చెల్లించి కొనుగోలు చేస్తే అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాల ఆంక్షలను ఎదుర్కోవాల్సి… -
Anti-rape Footwear: అత్యాచార నిరోధక ఫుట్‌వేర్‌ని రూపొందించిన కర్ణాటక విద్యార్థిని
Student develops 'anti-rape footwear' with GPS: కర్ణాటకకు చెందిన పదో తరగతి విద్యార్థిని వినూత్నంగా ఆలోచించింది. ప్రస్తుతం సమాజంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో ‘యాంటీ రేప్ ఫుట్‌వేర్’ని తయారు చేసింది. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేందుకు ప్రయత్నించే కామాంధుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఈ పాదరక్షలు ఉపయోగపడనున్నాయి. బాలికలు, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే నేరస్థుల నుంచి కాపాడుకునేందుకు ‘యాంటీ రేప్ ఫుట్‌వేర్’ ఉపయోగపడనుందని వీటిని రూపొందించిన విద్యార్థిని చెబుతోంది. -
Qatar: ఖతార్‌లో వరసగా జర్నలిస్టుల మరణాలు.. ప్రభుత్వ ప్రమేయంపై అనుమానాలు
Journalist Khalid al-Misslam Dies During World Cup In Qatar: ఫిపా ప్రపంచకప్ 2022కు ఖతార్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే అక్కడి వచ్చే ప్రపంచ పుట్ బాల్ అభిమానులు మాత్రం తమ చట్టాలను ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. వస్త్రధారణ, స్వలింగ సంపర్కం వంటి వాటిపై నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే స్వలింగ సంపర్కులకు మద్దతు తెలిపే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టినా.. వారిని వెంటనే జైళ్లలో వేస్తోంది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!