Venu Goapl Reddy
Author- NTV Telugu-
Madhy Pradesh: లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ..
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న తరుణంలో బీజేపీకి ఈ విజయం దక్కడంపై ఆ పార్టీ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 5 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న 19 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. దీంతో 11 మున్సిపాలిటీల్లో బీజేపీ విజయం సాధించగా.. 8 పట్టణాల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది. బీజేపీ అభ్యర్థులు 183 కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకోగా.. 143 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. -
HCU: హెచ్‌సీయూలో మోదీ డాక్యుమెంటరీ కలకలం.. అధికారులు విచారణ
Hyderabad Central University: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో కలకలం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ను ప్రదర్శించడం వివాదాస్పదం అయింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. యూనివర్సిటీలో కొంతమంది ప్రధాని మోదీ డాక్యుమెంటరీని ప్రదర్శించారని క్యాంపస్ అధికారులకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ఫిర్యాదు చేసింది. దీంతో మరోసారి హెచ్‌సీయూ వార్తల్లో నిలిచింది. -
BBC Documentary on Modi: మోదీపై డాక్యుమెంటరీ.. బీబీసీపై విచారణకు పిటిషన్..
BBC Documentary on Modi: ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ రచ్చకు దారి తీసింది. యూకే-ఇండియా సంబంధాలపై ప్రభావం పడేలా ఉండటం ఉంది. మరోవైపు యూకే, ఇండియాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చల్లో ఉండగా ఈ డాక్యుమెంటరీని బీబీసీ విడుదల చేయడంపై అక్కడి ఎంపీలు మండి పడుతున్నారు. ఇదిలా ఉంటే భారత ప్రభుత్వం ఈ వీడియోను బ్యాన్ చేసింది. వలసవాద మనస్తత్వానికి నిదర్శనం ఈ డాక్యుమెంటరీ అంటూ భారత ప్రభుత్వం వ్యాఖ్యానించింది. -
Uddhav Thackeray: అంబేద్కర్ మనవడితో ఉద్ధవ్ ఠాక్రే పొత్తు..
Maharashtra Politics: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ పార్టీ వంచిత్ బహుజన్ అఘాడీ(వీబీఏ)తో ఉద్ధవ్ ఠాక్రే శివసేన పొత్తు పెట్టుకుంది. ఈ రెండు పార్టీలు కలిసి వచ్చే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాలాసాహెబ్ ఠాక్రేలకు సమాజంలో దురాచారాలకు వ్యతిరేకంగా నిలబడిన వారసత్వం ఉందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. బాలాసాహెబ్ థాకరే జయంతిని పురస్కరించుకుని శివసేన (యుబిటి), విబిఎ కూటమి మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పును తీసుకువస్తుందని వంచిత్ బహుజన్ అఘాడి… -
Arvind Kejriwal: ఐటీ లేఆఫ్స్‌పై కేంద్రానికి కేజ్రీవాల్ విజ్ఞప్తి
On Tech Layoffs, Arvind Kejriwal's Appeal To Centre: ప్రపంచవ్యాప్తంగా పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఆర్థికమాంద్యం భయాల నేపథ్యం కంపెనీలు ఖర్చు తగ్గించుకునేందుకు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఇదిలా ఉంటే దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో కూడా భయాందోళనలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే పలు టెక్ కంపెనీల్లో భారీగా ఉద్యోగుల తొలగింపుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని సమీక్షించి కేంద్రం చర్యలు తీసుకోవాలని సోమవారం ట్విట్టర్ ద్వారా కోరారు. ఐటీ రంగం నుంచి యువకులు పెద్ద… -
INS Vagir: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ వజీర్.. ప్రత్యేకతలు ఇవే..
INS Vagir commissioned into Indian Navy: భారత నౌకాదళం మరింతగా బలోపేతం అయింది. కల్వరి క్లాస్ కు చెందిన 5వ జలంతార్గామ ఐఎన్ఎస్ వగీర్ సోమవారం నౌకాదళంలో చేరింది. ముంబైలోని నావల్ డాక్ యార్డ్ లో చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ సమక్షంలో ఐఎన్ఎస్ వగీర్ నౌకాదళలోకి ప్రవేశించింది. అత్యంత తక్కువ కాలంలో 24 నెలల్లోనే భారత నౌకాదళంలోకి ప్రవేశించిన మూడో జలంతర్గామి అని హరికుమార్ అన్నారు. భారతదేశ షిప్‌యార్డ్‌ల నైపుణ్యానికి ఇది నిదర్శనమని కొనియాడారు -
Thailand: థాయ్‌లాండ్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు పిల్లలతో సహా 11 మంది సజీవదహనం
Thailand van accident: థాయ్‌లాండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ ప్రమాదానికి గురికావడంతో ఇద్దరు పిల్లలతో సహా 11 మంది సజీవదహనం అయ్యారు. లూనాన్ న్యూ ఇయర్ సెలవుల సందర్భంగా సెంట్రల్ థాయ్‌లాండ్ నుంచి ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి ప్రమాదనికి గురైందని 11 మంది మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మొత్తం ప్రమాదంలో ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డా -
Hijab Ban: హిజాబ్ అంశంపై అత్యవసర విచారణ.. త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు..
Hijab Ban issue: హిజాబ్ నిషేధం అంశంపై మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. కర్ణాటకకు చెందిన ముస్లిం విద్యార్థులు హిజాబ్ తో పరీక్షలకు హాజరు కావడానికి అనుమతి కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హిజాబ్ అంశంపై అత్యవసర విచారణ కోసం త్రిసభ్య ధర్మసానాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఈ మేరకు హిజాబ్ కేసును అత్యవసర విచారణ కోసం లిస్ట్ చేసింది. ఫిబ్రవరి 6 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతున్న కారణంగా ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలని పిటిషన్ దారుల తరుపు న్యాయవాది మీనాక్షి అరోరా… -
Spotify: టెక్ లేఆఫ్ జాబితాలోకి మరో కంపెనీ.. ఉద్యోగుల తొలగించే యోచనలో స్పాటిఫై
Spotify To Begin Laying Off: టెక్ లేఆఫ్స్ పరంపర కొనసాగుతూనే ఉంది. రోజుకో కంపెనీ తమ ఉద్యోగులను తొలగిస్తున్నామని ప్రకటిస్తోంది. తాజాగా ప్రముఖ టెక్ కంపెనీ స్పాటిఫై కూడా తమ ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ ఓ నివేదికలో వెల్లడించింది. ఈ వారంలో తొలగింపులు ఉండవచ్చని ప్రకటించింది. అక్టోబర్ నెలలో స్పాటిఫై గిమ్లెట్ మీడియా, పార్కాస్ట్ పోడ్ కాస్ట్ స్టూడియోల నుంచి 38 మందిని, సెప్టెంబర్ నెలలో ఎడిటోరియల్ ఉద్యోగులను తొలగించింది. అయితే ఎంత మందిని తీసేస్తుందనేదానిపై ఇంకా స్పష్టత లేదు. -
Australia: మెల్బోర్న్లో ఇస్కాన్ టెంపుల్‌పై ఇండియా వ్యతిరేక వ్యాఖ్యలు.. వరసగా మూడో సంఘటన
Australia: ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలే టార్గెట్ గా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఖలిస్తానీ వేర్పాటువాద మద్దతుదారులు ఆలయాలపై దాడులు చేస్తూ భారత వ్యతిరేక, ఖలిస్తానీ మద్దతుగా స్లోగన్స్ రాస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మెల్బోర్న్ నగరంలోని ఆల్బర్ట్ పార్క్ లోని ఇస్కాన్ దేవాలయం గోడపై సోమవారం ఉదయం ‘‘ఖలిస్తాన్ జిందాబాద్’’ అనే నినాదాలు కనిపించాయి. ఇది ఈ నెలలో మూడో దాడి.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
-
Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
-
OTR: వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే పనబాక ప్లాన్!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..