ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్’లో బై బై 2025 సేల్ ప్రారంభమైంది. 2025 ముగుస్తుండటంతో బై బై సేల్ నిర్వహిస్తోంది. డిసెంబర్ 5న ప్రారంభమైన ఈ సేల్ 10 వరకు ఉంటుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లతో సహా అనేక వస్తువులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 6 (Samsung Galaxy Z Flip 6)పై మతిపోయే డిస్కౌంట్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫ్లిప్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌ను కొనుగోలు చేయడంతో రూ.24 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. మీరు చాలా కాలంగా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేసినా లేదా మొదటిసారి ఫ్లిప్ ఫోన్‌ను కొనాలనుకున్నా ఈ ఆఫర్ బెస్ట్ అనే చెప్పాలి. ఇటువంటి ఆఫర్‌లు ఎక్కువ కాలం ఉండవు కాబట్టి త్వరగా కొనేసుకుంటే బెటర్.
గెలాక్సీ జడ్ ఫ్లిప్ 6 స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 2024లో శాంసంగ్ లాంచ్ చేసింది. భారతదేశంలో లాంచ్ ధర రూ.1,09,999గా ఉంది. బై బై 2025 సేల్ సమయంలో ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై రూ.20,000 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంటే మీకు 18 శాతం తగ్గింపు లభిస్తుంది. ఫ్లాట్ డిస్కౌంట్ అనంతరం ధర రూ.89,999కి తగ్గుతుంది. యాక్సిస్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై అదనంగా రూ.4,000 తగ్గింపును కూడా పొందవచ్చు. బ్యాంక్ డిస్కౌంట్ అనంతరం రూ.85,999కి జడ్ ఫ్లిప్ 6 స్మార్ట్‌ఫోన్ మీ సొంతం అవుతుంది.
Also Read: Shakib Al Hasan: యూ టర్న్ తీసుకున్న షకీబ్ అల్ హసన్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ..!
శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 6 స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్ అత్యధికంగా రూ.82,934ని ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద అందిస్తోంది. గూగుల్ పిక్సెల్ 6ఏపై 8 వేల ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఉంది. మోటో ఎడ్జ్ 40 నియోపై రూ.7,750ని అందిస్తోంది. ఐఫోన్ 16పై రూ.27,950 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఇస్తోంది. మీరు ఐఫోన్ 16ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే.. రూ.58 వేలకు గెలాక్సీ జడ్ ఫ్లిప్ 6 స్మార్ట్‌ఫోన్‌ను మీరు సొంతం చేసుకోవచ్చు.