KTR: కాంగ్రెస్ పార్టీకి ఒకటి కాదు పది ఛాన్సులు ఇచ్చాం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారని.. కాంగ్రెస్ పార్టీకి ఒకటి కాదు పది ఛాన్సులు ఇచ్చామని అయినా అభివృద్ధి జరగలేదని.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు మంత్రి కేటీఆర్. కోల్లాపూర్ లో జరిగిన సభలో ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాలం చెల్లిన మందులాంటిది కాంగ్రెస్ అని.. ఎలా నమ్మాలని ప్రశ్నించారు. అనాలోచిత విధానాలతో దేశాన్ని రావణకాష్టంలా మార్చింది బీజేపీ అని, స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తెస్తామని చెప్పారని.. మాట తప్పారని, కాంగ్రెస్, బీజేపీ మాయమాటలు నమ్మకండి. అభివృద్ధి కాముకులను ప్రోత్సాహించండి అని ప్రజలను కోరారు.
65 ఏళ్లలో పరిష్కారం కానీ తాగు నీటి, కరెంట్ సమస్యలకు కేసీఆర్ సర్కార్ పరిష్కారం చూపిందని ఆయన అన్నారు. గతంలో తాగునీటి కష్టాలతో ఎండాకాలంలో ఊళ్లలో ఉండేందుకు జనం భయపడేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత రూ. 200 పెన్షన్ 10 రెట్లు పెరిగింది. 40 లక్షల మందికి , రూ.10 వేల కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు పెడుతున్నాం అని వెల్లడించారు. జూలై, ఆగస్టు నెలల్లో ఊరురూ తిరిగి, ప్రతి కాలనీ తిరిగి అక్కడికక్కడే పెన్షన్లిస్తాం అని అన్నారు. కొత్త రేషన్ కార్డులను కూడా ఇస్తామని తెలిపారు.
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
973 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఏడాదికి 5 లక్షల మందికి విద్యనందిస్తున్నామని.. ఇంతటి సంస్కారవంతమైన ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా..? అని ప్రశ్నించారు. రూ.20 వేల కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఖర్చు పెడుతున్నామని వెల్లడించారు. పెళ్లి చేసి చూడు, ఇళ్లు కట్టి చూడు అనే నానుడి ఉండేది.. పేదబిడ్డ పెళ్లికి ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీని అందిస్తుందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 36 నుంచి 56 శాతానికి ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెరిగిందని.. వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద దేశంలో ఎక్కడా లేని విధంగా 63 లక్షల మంది రైతులకు రూ.50 వేల కోట్లు రైతు బంధు అందించామని వెల్లడించారు. .సోమశిల సిదేదశ్వరం వంతెనతో ఆంధ్రాకు హైదరాబాద్ కు జంక్షన్ లా కొల్లాపూర్ మారనుందని అన్నారు. అమరగిరిని ఏకో టూరిజం కింద అభివృద్ది చేస్తామని..ఆహార శుద్ది పరిశ్రమలు నెలకొల్పుతామని.. ఉద్యాన వన పాలిటెక్నిక్ ఏర్పాటు చేస్తాం అని హామీలు ఇచ్చారు.
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!