దక్షిణాఫ్రికాతో స్వదేశంలో భారత జట్టు మూడు ఫార్మాట్‌లలో సిరీస్‌లు ఆడుతోంది. ఇప్పటికే టెస్ట్, వన్డే సిరీస్‌లు పూర్తయ్యాయి. 0-2 తేడాతో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయిన భారత్.. 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక డిసెంబర్ 9 నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. వైట్ బాల్ క్రికెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న టీమిండియా టీ20 ఫార్మాట్‌లో తన మార్క్ చూపెట్టేందుకు సిద్దమైంది. టీ20 సిరీస్‌లో కూడా సఫారీలను చిత్తు చేయాలని భారత్ చూస్తోంది. టీ20 సిరీస్ నేపథ్యంలో షెడ్యూల్, టీమ్స్, ముఖాముఖి రికార్డులను ఓసారి పరిశీలిద్దాం.
లైవ్ స్ట్రీమింగ్:
రెండో టెస్ట్‌లో గాయానికి గురైన శుభ్‌మన్ గిల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించి టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. అభిషేక్ శర్మతో అతడు ఇన్నింగ్స్ ఆరంబించనున్నాడు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్‌రౌండర్లతో పాటు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలతో మంచి బౌలింగ్ లైనప్ ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ఏ ఇద్దరు చెలరేగినా భారత్ సునాయాస విజయం సాధిస్తుంది. కటక్ వేదికగా మంగళవారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. JioHotstarలో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.
ముఖాముఖి రికార్డులు:
భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటివరకు 31 సార్లు టీ20ల్లో తలపడ్డాయి. ఇందులో 18 మ్యాచ్‌లలో భారత్, 12 మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా గెలిచింది. 1 మ్యాచ్‌లో ఫలితం రాలేదు. స్వదేశంలో భారత్ 5 మ్యాచుల్లో గెలిస్తే.. సఫారీలు 4 మ్యాచ్‌లలో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ 9 మ్యాచుల్లో గెలవగా.. భారత గడ్డపై దక్షిణాఫ్రికా 6 మ్యాచుల్లో గెలిచింది. తటస్థ వేదికల్లో భారత్ 4 సార్లు గెలవగా.. దక్షిణాఫ్రికా 2 మ్యాచుల్లో జయకేతనం ఎగురవేసింది.
Also Read: Palash Muchhal-Smriti Mandhana: మంధాన మధుర జ్ఞాపకాన్ని చెరిపేసిన పలాష్ ముచ్చల్!
టీ20 షెడ్యూల్ ఇదే:
# తొలి టీ20 – డిసెంబర్ 9 (కటక్)
# రెండో టీ20 – డిసెంబర్ 11 (ముల్లాన్‌పూర్)
# మూడో టీ20 – డిసెంబర్ 14 (ధర్మశాల)
# నాలుగో టీ20 – డిసెంబర్ 17 (లక్నో)
# ఇది టీ20 – డిసెంబర్ 19 (అహ్మదాబాద్)
జట్లు:
భారత్: శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, సంజు శాంసన్, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.
దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రరమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రీవిస్, టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, జార్జ్ లిండే, కార్బిన్ బాష్, మార్కో జాన్సెన్, క్వింటన్ డి కాక్, డోనోవన్ ఫెరీరా, ట్రిస్టన్ స్టబ్స్, ఒట్నీల్ బార్ట్‌మాన్, కేశవ్ మహారాజ్, క్వేనా మఫాగిజి, క్వేనా మఫాగిజ్.