Farooq Abdullah: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా నేను పోటీలో లేను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఉమ్మడి అభ్యర్థిని నియమించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నప్పటికీ.. అడుగు కూడా ముందుకు పడటం లేదు. విపక్షాలు అనుకుంటున్న అభ్యర్థులు క్రమంగా తాము పోటీలో ఉండబోవడం లేదని చెబుతున్నారు. గతంలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ నేత, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ ను అనుకున్నప్పటికీ.. ఆయన నేను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. దీంతో విపక్షాలు మరికొన్ని పేర్లను తెరపైకి తీసుకువచ్చాయి.
తాజాగా శరద్ పవార్ దారిలోనే నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా కూడా నడుస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా తాను ఉండటానికి నిరాకరించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల ఢిల్లీలో ప్రతిపక్షాల సమావేశాన్ని నిర్వహించింది. అయితే ఇందులో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని ఎన్నికల్లో నిలబెట్టాలని అంతా అనుకున్నారు. అయితే ఫరూఖ్ అబ్దుల్లా పేరు వినిపించింది. కాగా తాను ఈ పోటీలో లేనిని చెప్పడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. భారత రాష్ట్రపతిగా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పరిగణించకుండా తన పేరును ఉపసంహరించుకుంటున్నానని.. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ పరిస్థితి క్లిష్టంగా ఉందని.. ఈ అనిశ్చిత సమాయాల్లో కాశ్మీర్ కు నా ప్రయత్నాలు అవసరం అని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ పేరు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రముఖంగా వినిపిస్తోంది.
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
అయితే ఇప్పటి వరకు ప్రతిపక్షాలు ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించడంలో విఫలం అయ్యాయి. ఇదిలావుండగా, రాష్ట్రపతి ఎన్నికలకు ఏకాభిప్రాయ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు జూన్ 20-21 తేదీల్లో సమావేశం కానున్నారు. ముంబైలో శరద్ పవార్ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి సమావేశానికి టీడీపీ, వైసీపీ, బిజూజనతా దళ్, టీఆర్ఎస్, ఆప్ వంటి పార్టీలు హాజరుకాలేదు. కాంగ్రెస్ తో వేదిక పంచుకునేందకు ఆప్, టీఆర్ఎస్ సిద్ధంగా లేవు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!