Venu Goapl Reddy
Author- NTV Telugu-
Delhi MCD Polls: ఢిల్లీ పీఠం ఆప్‌దే.. బీజేపీ ఆధిపత్యానికి గండి.. 134 స్థానాల్లో విజయం
AAP's big win in Delhi Municipal Corporation elections: ఢిల్లీ ప్రజలు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు. ఢిల్లీని ఆప్ కైవసం చేసుకుంది. 15 ఏళ్ల బీజేపీ ఆధిపత్యానికి గండికొట్టింది. బీజేపీ కంచుకోటగా ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(డీఎంసీ)ని చీపురు పార్టీ గెలుచుకుంది. మొత్తం 250 స్థానాలు ఉన్న డీఎంసీ ఫలితాలు వెల్లడయ్యాయి. 134 వార్డులను ఆప్ గెలుచుకోగా.. 104 వార్డులను బీజేపీ కైవసం చేసుకుంది. ఎగ్జిట్ పోల్స్ ముందుగా అంచానా వేసిన విధంగా అయితే… -
Arvind Kejriwal: ప్రధాని మోదీ ఆశీస్సులు కావాలి.. ఢిల్లీ విజయం తర్వాత కేజ్రీవాల్..
Arvind Kejriwal's reaction to Delhi's victory: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 15 ఏళ్ల బీజేపీ ఆధిపత్యానికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గండికొట్టింది. ఢిల్లీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 250 స్థానాల్లో ఆప్ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటింది. మొత్తంగా 134 స్థానాలను, బీజేపీ 104 స్థానాలను, కాంగ్రెస్ 9 స్థానాలను కైవసం చేసుకుంది. ఇంకా కౌంటింగ్ జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈ విజయంపై ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబంరాలు చేసుకుంటున్నారు. -
Border Dispute: సరిహద్దు వివాదం.. కర్ణాటకకు మహారాష్ట్ర బస్సులు బంద్..
Border issue between Karnataka and Maharashtra: కర్ణాటక, మహారాష్ట్రల సరిహద్దు వివాదం రోజు రోజుకు ముదురుతోంది. రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా.. బీజేపీ వర్సెస్ బీజేపీగా మారింది ఈ వివాదం. ఇప్పటికే కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, కర్ణాటక డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య మాటల తూటాలు పేలాయి. రెండు రాష్ట్రాల సరిహద్దు సమస్యలకు బెలగావి కేంద్రంగా మారింది. అయితే మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా అక్కల్ కోట్ తహసీల్ పరిధిలోని 11 గ్రామాలు తమకు సరైన ప్రాథమిక సౌకర్యాలు… -
Nigeria: నైజీరియాలో దారుణం.. మసీదులో కాల్పులు.. 12 మంది మృతి
Gunmen kill 12, including imam, abduct others from mosque in Nigeria: ఆఫ్రికా దేశం నైజీరియాలో ముష్కరులు ఘాతుకానికి పాల్పడ్డారు. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో ఇమామ్ తో సహా 12 మంది మరణించారు. మరికొంత మంది కిడ్నాప్ చేశారు. ఈ ఘటన నైజీరియా కట్సనా రాష్ట్రంలో జరిగింది. ఇది ప్రెసిడెంట్ మహ్మద్ బుహరీ సొంత రాష్ట్రం. -
Gujarat: ముస్లిం మహిళలు ఎన్నికల్లో పోటీ చేయడం ఇస్లాంకు వ్యతిరేకం.. మతాన్ని బలహీన పరచాలనే ఇలా..
Gujarat Cleric Slams Muslim Women In Elections: ముస్లిం మహిళలను ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎంపిక చేసేవారు ఇస్లాంకు వ్యతిరేకం వ్యతిరేకంగా మతాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ గుజరాత్ రాష్ట్రానికి చెందిన మతాధికారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ రెండో విడత ఎన్నికలకు ముందు ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ కు చెందిన జామా మసీద్ మతాధికారి షబ్బీర్ అహ్మద్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. ఇస్లాంలో నమాజ్ కంటే ముఖ్యమైనది ఏదీ లేదని, మసీదుల్లో మహిళలు నమాజ్ చేయడం ఎప్పుడైనా చూశారా..? అంటూ ప్రశ్నించారు.… -
Madhya pradesh: పోలీసు వాహనాల నుంచి డీజిల్ దొంగిలించిన పోలీసులు..
5 Cops Suspended For Stealing Diesel From Police Vehicles In Madhya Pradesh: దొంగతనాలు, దోపిడీల నుంచి ప్రజలను పోలీసులు రక్షిస్తుంటారు. ప్రభుత్వానికి, ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. ఏదైనా అన్యాయం జరిగితే ముందుగా సామాన్యుడు ఆశ్రయించేది పోలీసులనే. అయితే అలాంటి పోలీసులే దొంగతనానికి పాల్పడితే.. నిజంగా ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఏకంగా సొంత పోలీస్ వాహనాల నుంచే డీజిల్ దొంగిలించారు. పోలీస్ వాహనాల నుంచి డీజిల్ దొంగతనం చేస్తే తెలియదని అనుకున్నారేమో కానీ చివరకు దొంగతనం బయటపడింది. -
Himanta Biswa Sarma: మా తల్లుల గర్భం ఏమైనా వ్యవసాయ స్థలమా..? హిందూ వ్యతిరేక వ్యాఖ్యలపై ఫైర్
Himanta Sarma Responds To B Ajmal's hindu Remarks: హిందూ సమాజంపై వివాదాస్పద వ్యాఖ్యల చేసిన అస్సాం పొలిటికల్ లీడర్ బద్రుద్దీన్ అజ్మల్ పై విరుచుకుపడ్డారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. పిల్లలు జన్మించడం, పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ.. హిందువులు ముస్లిం ఫార్మలాను అనుసరించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు అజ్మల్. సోమవారం అజ్మల్ సొంత నియోజకవర్గం అయిన ధుబ్రీకి సమీపంలోని బొంగైగావ్ లో జరిగిన ఓ బహిరంగ సభలో అజ్మల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు హిమంత బిశ్వ శర్మ. -
Harish Rawat: పీఓకేను వెనక్కి తీసుకునే సమయం వచ్చింది.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు
Time To Take PoK Back, says Congress Leader Harish Rawat: పాకిస్తాన్ ఆధీనంలో కాశ్మీర్ ప్రాంతంపై ఇటీవల కాలంలో విపరీతంగా చర్చ నడుస్తోంది. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు మన సైనికాధికారులు కూడా పీఓకే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటామని కామెంట్స్ చేశారు. అయితే ఈ కాంగ్రెస్ సీనియర్ నేత హరీష్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడానికి ఇదే మంచి సమయం అని అన్నారు. -
Exit Polls: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు బీజేపీవే.. తిరుగులేని కమలం పార్టీ..
BJP Retains Gujarat, Himachal: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో మళ్లీ బీజేపీని తిరుగులేని స్థానంలో నిలబెట్టారు అక్కడి ప్రజలు. మళ్లీ అధికారం బీజేపీ కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. మొత్తం 182 స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో 100కు పైగా స్థానాలు గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కూడా బీజేపీనే గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచానా వేస్తున్నాయి. -
Delhi MCD Exit Poll: ఆప్‌దే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్.. వెలువడిన ఎగ్జిట్ పోల్స్
Big Win For AAP In Delhi Municipal Election, Show 2 Exit Polls: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో చీపురు పార్టీ స్వీప్ చేయబోతోంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటుందని ఆజ్ తక్, టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. డిసెంబర్ 4న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లోని 250 వార్డులకు ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 7న ఫలితాలు వెల్లడి కానున్నాయి. డీలిమిటేషన్ తర్వాత తొలిసారిగా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరిగాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!