దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మూడో విడత మే 7న జరగనుంది. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. కానీ కాంగ్రెస్ మాత్రం రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది.
పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికా యూనివర్సిటీలు అట్టుడికాయి. విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన అమెరికా పోలీసులు.. నిరసనలపై ఉక్కుపాదం మోపారు.
రష్యాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దివంగత నేత, మాజీ ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ గ్రూపునకు చెందిన ఇద్దరు జర్నలిస్టులను పుతిన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఇద్దర్ని అరెస్ట్ చేశారు.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు నిరాకరించింది.
దక్షిణ బ్రెజిల్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పోర్టో అలెగ్రే నగరంలో నిరాశ్రయులకు తాత్కాలిక ఆశ్రయం కోసం ఉపయోగిస్తున్న హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మరణించారని అధికారులు తెలిపారు.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుజరాత్‌కు చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందారు. సౌత్ కరోలినాలోని గ్రీన్విల్లే కౌంటీలోని వీరు ప్రయాణిస్తున్న కారు హైవేమీద నుంచి వంతెనపైకి దూసుకెళ్లడంతో అక్కడిక్కడే ముగ్గురు ప్రాణాలు వదిలారు.
శనివారం కాంగ్రెస్ సీఈసీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలపై కాంగ్రెస్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు.
పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికా యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన అమెరికా పోలీసులు.. నిరసనపై ఉక్కుపాదం మోపారు.
రాజస్థాన్‌లోని అజ్మీర్ మసీదులో మత పెద్ద హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన వాసిగా పోలీసులు గుర్తించారు.