తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్‌ను రాజకీయ వారసుడిగా, పార్టీ జాతీయ కో-ఆర్డినేటర్ పదవి నుంచి బీఎస్పీ అధినేత్రి మాయావతి బుధవారం తొలగించారు. ఈ తొలగింపుపై తాజాగా గురువారం ‘ఎక్స్’ ట్విట్టర్ వేదికగా ఆకాశ్ ఆనంద్ స్పందించారు. మాయావతి.. బహుజన సమాజానికి రోల్ మోడల్ అని ఆయన తెలిపారు. బహుజనలు అంటే.. దళితులు, ఎస్టీలు, ఓబీసీలు అని పేర్కొన్నారు. మీ పోరాటం వల్లే బహుజన సమాజానికి ఇంత రాజకీయం బలం చేకూరిందని తెలిపారు. బహుజన సమాజం గౌరవంగా బ్రతకటం నేర్చుకుందన్నారు. మీరే మా అధినేత్రి అని.. తన తుది శ్వాస వరకు భీమ్ మిషన్, బహుజన సమాజం కోసం పోరాడతానని ఆకాశ్ ఆనంద్ ‘ఎక్స్’లో తెలిపారు.
ఇది కూడా చదవండి: Elections 2024: తెలంగాణ నుంచి సొంతూళ్లకు ఓటర్లు.. నెల క్రితమే రిజర్వేషన్లు..
ఇటీవల ఆకాశ్ ఆనంద్ బీజేపీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఆకాశ్ రాజకీయంగా పరిణతి సాధించే వరకు అన్ని బాధ్యతల నుంచి దూరంగా ఉంచుతున్నట్లు మాయావతి ప్రకటించారు. ఇటీవల ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆకాశ్ మాట్లాడుతూ యూపీలోని బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వాన్ని బుల్డోజర్ గవర్నమెంట్‌గా అభివర్ణించారు. అలాగే రాష్ట్రంలోని యువతను ఆకలితో ఉంచుతూ.. పెద్దలను బానిసలుగా మార్చుకుంటోందని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఈసీ అధికారులు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద నోటీసులు అందజేశారు. ఆకాశ్‌తో పాటు ర్యాలీ నిర్వహించిన మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. దీంతో ఆకాశ్‌కు సంబంధించిన అన్ని ర్యాలీలను బీఎస్పీ రద్దు చేసింది.
ఇది కూడా చదవండి: AP Elections 2024: ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యేపై దాడి.. కిందపడిపోయిన ఆనం
ఇదిలా ఉంటే 2023 డిసెంబర్‌లో మాయావతి తన రాజకీయ వారసుడిగా ఆకాశ్‌ను ప్రకటించింది. మాయావతి తమ్ముడి కుమారుడైన ఆకాశ్ లండన్‌లో ఎంబీఏ చదివారు. ఇక.. 2017లో బీఎస్పీలో చేరారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేశారు. పార్టీలో మాయావతి తర్వాత అత్యధిక ప్రాధాన్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
పార్టీ జాతీయ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించే ముందు ఆనంద్ పరిపక్వతకి చేరుకోవాలని మాయావతి చెప్పడంతో మే 7న ఆనంద్‌పై చర్యకు ఉప్రక్రమించారు. ఆకాష్ తండ్రి ఆనంద్ కుమార్ మాత్రం పార్టీలో తన పాత్రలో కొనసాగుతారని మాయావతి తెలిపారు.
ఇది కూడా చదవండి: Uttarpradesh : 29ఏళ్ల నాటి కేసు.. 100వారెంట్ల తర్వాత కూడా హాజరుకాని ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్