US: న్యూయార్క్‌లో దారుణం.. మహిళపై దుండగుడి అఘాయిత్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని కఠినచట్టాలు వచ్చిన కామాంధుల్లో మార్పు రావడం లేదు. పోలీసులన్నా.. చట్టాలన్నా ఏ మాత్రం భయం లేకుండా మానవ మృగాలు ప్రవర్తిస్తున్నారు. రోజురోజుకు మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. అగ్రరాజ్యం అమెరికాలో దారుణ సంఘటన జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడకు బెల్ట్ చుట్టి.. బలవంతంగా లాక్కెళ్లి ఘాతుకానికి తెగబడ్డాడు ఓ దుర్మార్గుడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్ అయింది.
ఇది కూడా చదవండి: THE GOAT: భారీ ధరకు విజయ్ ‘ది గోట్’ శాటిలైట్ రైట్స్..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
మే 1న బ్రాంక్స్ పరిసరాల్లో తెల్లవారుజామున 3 గంటలకు 45 ఏళ్ల మహిళ నడుచుకుంటూ వెళ్తోంది. ఆమెను వెంబడించిన ఓ వ్యక్తి.. ఆమె మెడకు బెల్ట్ చుట్టి స్పృహ కోల్పోయేలా చేశాడు. అనంతరం ఆమెను కారు వెనక్కి లాక్కెళ్లి అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆమె పూర్తిగా అచేతన స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనపై మహిళలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ముఖానికి మాస్క్ ధరించుకుని ఉండడంతో.. అతడి జాడ కోసం జల్లెడపడుతున్నారు. ఇదిలా ఉంటే.. మహిళకు నిందితుడు పరిచయం ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Ponnam Prabhakar: ఎస్సీ , ఎస్టీ ల రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర..
ఈ ఘటన జరిగి దాదాపు 10 రోజులైంది. కానీ ఇప్పటి వరకు నిందితుడు ఆచూకీ లభించలేదు. నిందితుడి ముఖంపై తెల్లటి గుడ్డ కప్పి ఉంది. వీడియోలో ఆమెతో ఏదో మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది. నడుచుకుంటూ వెళ్తుండగానే ఆమె మెడకు బెల్ట్ వేసి బలవంతంగా పక్కకు లాగాడు. పార్క్ చేసిన రెండు కార్ల మధ్యకు లాగి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఆమెపై దాడి జరిగిందని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఆమె ప్రాణాలతో బయటపడింది. సమీపంలోని ఆస్పత్రిలో ఆమె కోలుకుంటుందని.. పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. అయితే ఆమె పోలీసులకు సహకరించడం లేదని యూఎస్ మీడియాతో పేర్కొంది. నిందితుడికి సంబంధించిన క్లూను పోలీసులు విడుదల చేవారు. నల్లటి స్వెటర్, తెలుగు ప్యాంట్, నలుపు-ఎరుపు-తెలుపు స్నీకర్లు ధరించి ఉన్నాడని ఆనవాళ్లు చెప్పారు.
https://twitter.com/unlimited_ls/status/1788687616390365611
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?