పంజాబ్ కాంగ్రెస్ నాయకురాలు నవజ్యోత్ సిద్ధూ సతీమణి కౌర్ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమేనని.. అయితే పంజాబ్ ముఖ్యమంత్రి కావడానికి ‘రూ. 500 కోట్ల సూట్కేస్’ అవసరమని.. అంత డబ్బు తమ దగ్గర లేదన్నారు.
వందేమాతరం కేవలం పాట కాదని.. ఇది రాముడి భారత్ దార్శనికతను ప్రతిబింబిస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవం సందర్భంగా పార్లమెంట్లో మోడీ ప్రత్యేక చర్చ ప్రారంభించారు.
వందేమాతరం గీతం స్వాతంత్ర్య సమరయోధులకు స్ఫూర్తినిచ్చిందని ప్రధాని మోడీ అన్నారు. ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవం సందర్భంగా పార్లమెంట్లో మోడీ ప్రత్యేక చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ చర్చ భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.
ఇండిగో సంక్షోభంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక స్టేట్మెంట్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సంక్షోభంపై అత్యవసర విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సోమవారం పిటిషన్ విచారణకు రాగా... సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
భారతదేశంలో ఇండిగో ఎయిర్లైన్స్ సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. మా దగ్గర ఆటలు చెల్లవన్నట్టుగా అటు విమానయాన శాఖకు.. ఇటు ప్రయాణికులకు ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ ఓ పాఠం నేర్పించింది. గత వారం రోజులుగా ప్రయాణికులు విమానాశ్రయాల్లో నరక యాతన పడుతున్నారు.
దేశ వ్యాప్తంగా ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. గత వారం నుంచి విమానాలు నిలిచిపోవడంతో అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగిన కూడా పరిస్థితుల్లో మార్పులు కనిపించడం లేదు.
జమ్ముకాశ్మీర్ అటవీ ప్రాంతంలో స్పెషల్ ఆపరేషన్ బృందం దాడులు నిర్వహించింది. ఒక ఉగ్రవాద స్థావరంపై దాడి చేసింది. ఉగ్రవా ద స్థావరంలో రైఫిల్, 22 లైవ్ బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 1 న ప్రారంభమైన సమావేశాలు డిసెంబర్ 19 వరకు కొనసాగనున్నాయి. ఇక సమావేశాల్లో భాగంగా సోమవారం ప్రధాని మోడీ ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవంపై ప్రత్యేక చర్చ ప్రారంభించనున్నారు.
కంబోడియా-థాయ్లాండ్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇటీవలే ట్రంప్ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం చేశారు. మళ్లీ ఇంతలో ఏమైందో.. ఏమో తెలియదు గానీ సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.