భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్ చెప్పింది. వివిధ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, ఉరుములు, వడగళ్ల వానలు, వేడిగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. ఈశాన్యం నుంచి దక్షిణం, ఉత్తరం వరకు ఈ ప్రభావం ఉంటుందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Kedarnath Yatra: ముస్తాబైన కేదార్ నాథ్ ఆలయం.. రేపు తెరచుకోనున్న గుడి తలుపులు
అస్సాం, బంగ్లాదేశ్ మీదుగా తుఫాన్ ఏర్పడిందని తెలిపింది. ఇక రాజస్థాన్ నుంచి అస్సాం వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, జార్ఖండ్, ఒడిశాలో ఉరుములు, ఈదురు గాలులతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్, విదర్భలో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Zero Shadow day: ఈరోజు హైదరాబాద్ లో జీరో షాడో డే.. ఎన్నిగంటలకో తెలుసా..?
తమిళనాడు మీదుగా దక్షిణం వైపు ద్రోణి కదులుతోంది. దీంతో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అంతటా ఉరుములతో కూడిన విస్తారమైన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరి,కేరళలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలో ఈదురు గాలులు, ధూళి తుఫానులతో ఉత్తరాఖండ్‌లో వడగళ్ల వాన కురిసే ఛాన్సుందని చెప్పింది. కోస్తా గుజరాత్, కేరళలోని కొన్ని ప్రాంతాలలో వేడి మరియు తేమతో కూడిన వాతావరణం ఉంటుందని.. అదనంగా వివిధ ప్రాంతాల్లో వెచ్చని రాత్రులు ఉంటాయని చెప్పింది.
ఇది కూడా చదవండి: INDIA Alliance: ఎన్నికల కమిషన్ తో నేడు ఇండియా కూటమి నేతల సమావేశం