ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్-మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. మరోసారి వీరిద్దరూ అధ్యక్ష ఎన్నికల్లో తలపడబోతున్నారు. అయితే అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బారన్ ట్రంప్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. వచ్చే వారమే హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకుంటున్న బారన్ ట్రంప్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు ఆయన ఫ్లోరిడా ప్రతినిధిగా వెళ్లనున్నారు. ఈ మేరకు పార్టీ ఛైర్మన్ ఇవన్ పవర్ బుధవారం వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Election Commission: పోలింగ్ తేదీ తర్వాతే ఆ పథకాల సొమ్ము జమ చేయండి..!
నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఆయన ఎంపికను అధికారికంగా ధ్రువీకరించేందుకు జులైలో పార్టీ కన్వెన్షన్ జరగనుంది. దీనికి ఫ్లోరిడా నుంచి 41 మంది ప్రతినిధులు వెళ్లనున్నారు. వారిలో బారన్ ట్రంప్ ఒకరని పవర్ వెల్లడించారు. బారన్ ట్రంప్ ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటూ వచ్చారు. గత మార్చిలో ఆయనకు 18 ఏళ్లు వచ్చాయి. వచ్చే వారమే హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ కానున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు డొనాల్డ్ ట్రంప్‌నకు కోర్టు అనుమతి ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Mumbai Indians: ఎస్ఆర్హెచ్ దెబ్బకి ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై
2006లో జన్మించిన బారన్ ట్రంప్.. డొనాల్డ్ ట్రంప్‌కి ఐదో సంతానం. భార్య మెలానియాకు మాత్రం మొదటి సంతానం. బారన్ ఎప్పుడూ తన సోదరులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు.