Sandeshkhali Case: ఎన్నికల వేళ షాకింగ్ ట్విస్ట్.. కేసు విత్‌డ్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికలకు ముందు సందేశ్‌ఖాలీ ఘటన రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేశాయి. పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనతో రాష్ట్రం అట్టుడికింది. దీనికి బీజేపీ మద్దతు తెల్పడంతో మరింత ఉధృతం అయింది. హైకోర్టు ఆదేశాలతో మొత్తానికి నిందితుడు షాజహాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసును న్యాయస్థానం సీబీఐకి అప్పగించింది. దీన్ని సవాల్ చేస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ కేసు పెండింగ్‌లో
ఉంది.
ఇది కూడా చదవండి: AM Ratnam: పిఠాపురంలో పవన్ గెలుపును ఎవరు ఆపలేరు..!
Also Read
- Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
తాజాగా ఈ కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో కీలక మలుపు తిరిగింది. తమపై అకృత్యాలకు పాల్పడ్డారంటూ తృణమూల్ కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేసిన ముగ్గురు మహిళల్లో ఒకరు తాజాగా తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. తాను ఎలాంటి వేధింపులకు గురికాలేదని, బీజేపీ కార్యకర్తలే తనతో బలవంతంగా తెల్ల కాగితంపై సంతకం చేయించుకున్నారని ఆమె ఆరోపించారు. దీంతో ఈ కేసు ఊహించని మలుపు తీసుకుంది.
ఇది కూడా చదవండి: crime news: భర్తతో విభేదాల కారణంగా తన మూడేళ్ల కుమారుడికి కాల్చి చంపిన తల్లి
బీజేపీ మహిళా మోర్చా విభాగానికి చెందిన కొందరు నేతలు, ఇతర కార్యకర్తలు ఇంటికి వచ్చి.. పీఎంఏవైలో పేరును చేర్చుతామంటూ తెల్లకాగితంపై సంతకం తీసుకున్నారని ఆమె తెలిపింది. ఆ తర్వాత పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి టీఎంసీ నేతలపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయించారని చెప్పింది. తానెప్పుడూ రాత్రివేళ ఆ పార్టీ ఆఫీసుకు వెళ్లలేదని.. తనపై ఎలాంటి అకృత్యాలు జరగలేదని ఆ మహిళ పేర్కొన్నారు. తన వల్ల తప్పు జరిగిందని తెలుసుకుని ఇప్పుడు కేసును వెనక్కి తీసుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసి బీజేపీ నేతలు తనను బెదిరిస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే మహిళ ఆరోపణలను బీజేపీ నాయకులు ఖండిస్తున్నారు. ఎన్నికల వేళ ఈ పరిణామం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ బెంగాల్ పర్యటనలో భాగంగా సందేశ్‌ఖాలీ బాధితులను పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఒక బాధితురాలికి లోక్‌సభ సీటు కూడా ఇచ్చింది. ఎన్నికలు జరుగుతున్న వేళ సడన్‌గా యూటర్న్ తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు ఎలా సాగుతుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: Service App Hacked : 108, 102 అంబులెన్స్ సర్వీస్ యాప్ హ్యాక్.. రూ.500ఇచ్చి హాజరు వేయించుకుంటున్న ఉద్యోగులు
తాజావార్తలు
-
OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..