ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షంతో పాటు పెద్ద ఎత్తున మంచు కూడా కురుస్తుంది. దీంతో చార్ధామ్ యాత్రకు తీవ్ర ఇక్కట్లు ఏర్పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. సడన్‌గా తెలుగు రాష్ట్రాల విద్యార్థుల దగ్గర ప్రత్యక్షమయ్యారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భవన్ దగ్గరకు వచ్చారు.
సార్వత్రిక ఎన్నికల్లో కుమారుడు వరుణ్ గాంధీకి టికెట్ దక్కకపోవడంపై తొలిసారి తల్లి మేనకాగాంధీ స్పందించారు. వరుణ్‌పై తనకు విశ్వాసం ఉందని.. సమర్థవంతుడైన నాయకుడు అని కొనియాడారు.
రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా నేరాలు మాత్రం ఆగడం లేదు. ఉద్యోగం మానేసిందన్న కారణంతో పాత యజమాని.. ఇంటికి వచ్చి గొడవ పెట్టుకుని మహిళను కత్తితో పొడిచి చంపాడు.
ఆప్ఘనిస్తాన్‌ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరదలకు 200 మంది మృతిచెందినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తాలిబన్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
అమరావతి ఎంపీ, బీజేపీ అభ్యర్థి నవనీత్ కౌర్ మరోసారి ఒవైసీ సోదరులకు ఘాటు వార్నింగ్ ఇచ్చారు. భారతదేశంలోని ప్రతి వీధిలో రామభక్తులు, మోడీ సింహాలు ఉన్నాయని హెచ్చరించారు.