Pawan Kalyan: మంగళగిరిలో శుక్రవారం మధ్యాహ్నం అంధ మహిళల క్రికెట్ జట్టుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ కప్ గెలిచిన అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన దీపిక తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేదని ఉప ముఖ్యమంత్రికి తెలిపారు. తమ ఊరు తంబలహెట్టి రోడ్డు వేయించమని ఆయనను కోరారు. ఆమె మధ్యాహ్నం అడిగిన రోడ్డుకి సాయంత్రం లోపు అనుమతులు వచ్చేలా ఉప ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారు.
READ ALSO: Hardik Pandya Gambhir Fight: హార్దిక్-గంభీర్ గొడవపడ్డారా? వైరల్‌గా మారిన వీడియో
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక విజ్ఞప్తి మేరకు రోడ్లను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా శ్రీ సత్యసాయి జిల్లా అధికారులు మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలోని హేమవతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహెట్టి రోడ్లను పరిశీలించారు. హేమావతి నుంచి తంబలహెట్టి వరకూ రోడ్డు నిర్మాణానికి రూ.3.2 కోట్లు, గున్నేహళ్లి నుంచి తంబలహెట్టీ వరకూ 5 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు అవసరమని అంచనా ప్రతిపాదనలు రూపొందించారు. వెంటనే వీటికి అనుమతులు ఇవ్వాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ రోడ్డు నిర్మాణానికి శుక్రవారం సాయంత్రమే అనుమతులు జారీ చేశారు.
READ ALSO: Vissannapeta Financial Scam: నమ్మించి నట్టేట ముంచిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సంస్థ