దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగుతున్నాయి. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. నాల్గో విడతకు ఈసీ ఏర్పాట్లుచేస్తోంది. సోమవారమే నాల్గో విడత పోలింగ్ జరగనుంది. ఈ తరుణంలో బీజేపీ పంజాబ్లోని ఫతేఘర్ సాహిబ్ రిజర్వ్ పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థిని ప్రకటించింది. పంజాబ్ రాష్ట్ర సఫాయి కరంచారి కమిషన్కు ఛైర్మన్ అయిన గెజ్జా రామ్ వాల్మీకిని పంజాబ్లోని ఫతేఘర్ సాహిబ్ రిజర్వ్ పార్లమెంటరీ నియోజకవర్గం బరిలో దింపింది. ఇది కూడా చదవండి: UP: ఇద్దరు పురుషులతో హోటల్ […]
పాక్తో యుద్ధం తర్వాత జరిగిన చర్చల్లో మనం ఒక షరతు పెట్టి ఉండాల్సిందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. సిక్కులు పవిత్రంగా భావించే కర్తార్పూర్ సాహిబ్.. మనకు దక్కాలని గట్టిగా అడిగి ఉండాల్సిందన్నారు.
భారత్-పాకిస్థాన్ యుద్ధం జరిగాక 93 వేల మంది సైనికులు.. భారత సైన్యానికి సరెండర్ అయ్యారని ప్రధాని మోడీ అన్నారు. ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ మాట్లాడారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. యువత హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఫేమస్ కావడం కోసమో.. వ్యూస్ కోసమో.. లేనిపోని సాహసాలు చేసి కన్నతల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు.
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. కొద్దిసేపటి క్రితం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. శుక్రవారం ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరికాసేపట్లో తీహార్ జైలు నుంచి విడుదలకానున్నారు. శుక్రవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన పత్రాలు జైలు అధికారులకు అందాయి.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ మహారాష్ట్రలో పర్యటించారు. ఈ సందర్భంగా శరద్ పవార్, ఉద్ధవ్ థాకరేలపై విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీలు.. నకిలీ పార్టీలుగా అభివర్ణించారు.
ఖలిస్తానీ నాయకుడు అమృత్పాల్ సింగ్ పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశాడు. నిబంధనల ప్రకారం అతడికి సహకరించినట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది.