Encounter: కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా వాంటెడ్ టెర్రరిస్ట్ బాసిత్ దార్‌తో సహా ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది. గత సోమవారం రాత్రి మొదలైన కాల్పులు దాదాపు 40 గంటల తర్వాత గురువారం ఉదయం ముగిశాయి. ఉగ్రవాదుల నుంచి అనేక ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Smriti Irani: ఎక్కడ డిబేట్ పెట్టిన నేను రెడీ.. ప్రియాంక గాంధీకి స్మృతి ఇరానీ సవాల్..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
కుల్గామ్‌లోని రెడ్వానీ పైన్‌లో దాదాపు 40 గంటల పాటు జాయింట్ ఆపరేషన్ కొనసాగిందని భారత సైన్యం ట్విట్టర్‌లో తెలిపింది. ఉగ్రవాదుల నుంచి భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్‌లోని రెడ్వానీ పైన్ ప్రాంతంలో సోమవారం-మంగళవారం మధ్య రాత్రి ఉగ్రవాదులు-భద్రతా దళాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. హతమైన ఉగ్రవాదుల్లో ఒకడైన బాసిత్ దార్ 18కి పైగా కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. అమాయక పౌరులను హత్య చేయడం మరియు మైనారిటీలపై దాడులకు ప్లాన్ చేయడంతో సహా కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: Air India Express: ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగులపై వేటు..
బాసిత్ దార్‌పై 10 లక్షల రూపాయల నగదు బహుమతిని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. మరియు అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. 2011లో కుల్గామ్‌లో ఇద్దరు స్థానికేతరులను హత్య చేసిన కేసులో ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి.ఈ నెల ప్రారంభంలో జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భారత వైమానిక దళం కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు భారత వైమానిక దళ సభ్యుడ్ని చంపారు. 15 నిమిషాల వ్యవధిలో వాహనంపై దాదాపు 200 బుల్లెట్లు దూసుకెళ్లాయి.
హతమైన ఉగ్రవాదులు 18 మందిని హత్య చేశారని.. అలాంటి దుర్మార్గులను ఎన్ కౌంటర్ చేయడం తమకు పెద్ద విజయమని భద్రతా బలగాలు చెప్పాయి. మే 4న పూంచ్ జిల్లాలో భద్రత బలగాలను లక్ష్యంగా చేసుకున్న దాడుల్లో భారత వైమానిక దళ అధికారి మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. దీంతో ఆ ప్రాంతంపై భద్రతా బలగాలు గట్టి నిఘా ఉంచాయి. ఆ దాడుల్లో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల ఫొటోలను బుధవారం విడుదల చేశారు. వారిలో పాకిస్థాన్ ఆర్మీ మాజీ కమాండో ఇలియాస్, ఉగ్రవాది హడూన్ అలియాస్ హుడూన్, లష్కరే తోయిబా కమాండర్ అబు హమ్జాగా గుర్తించారు. ప్రస్తుతం వీరిని కనిపెట్టే పనిలో ఉన్నట్లు వివరించారు.
ఇది కూడా చదవండి: Pakistan : పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదుల దాడి.. ఏడుగురు మృతి
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!