టిడ్కో ఇళ్ల పరిస్థితిపై పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగూరు నారాయణ.. వచ్చే జూన్ నెలాఖరులోపు 2,61,640 టిడ్కో ఇళ్లను పూర్తి చేసేలా ముందుకెళ్తున్నాం అని ప్రకటించిన ఆయన.. ఎక్కడైనా పూర్తయిన ఇళ్లను ప్రతి శనివారం లబ్దిదారులకు అప్పగించాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలిచ్చాం అన్నారు.. మొత్తం ఇళ్ల నిర్మాణంతో పాటు మౌళిక వసతులకు, కాంట్రాక్టర్ల పెండింగ్ బకాయిలకు కలిపి రూ.7,280 కోట్లు అవసరం.. ఈ నిధులను హడ్కో ద్వారా, వివిధ బ్యాంకుల నుంచి లోన్ లు…
భూ వివాదంలో కన్న కొడుకు ప్రాణాలనే తీసింది ఓ తల్లి.. తరచూ పొలం విషయంలో గొడవ జరగడం.. తాజాగా మరోసారి కూడా అదే ఘర్షణ జరగడంతో.. కొడుకునే తల్లి దారుణంగా హత్య చేసిందని మృతుడి భార్య ఆరోపిస్తోంది.
ఉల్లి రైతుకు మేలు చేయకపోతే రాజీనామా చేయండి అంటూ డిమాండ్ చేశారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో పర్యటించింది సీపీఎం నేతల బృందం.. ఉల్లి రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు నేతలు.. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉల్లి రైతులు దయనీయ స్థితిలో వున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..
విజయవాడ, విశాఖ మెట్రో రైల్ టెండర్లలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు అయ్యింది.. దీనిపై కీలక ప్రకటన చేశారు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎన్పీ రామకృష్ణా రెడ్డి.. విజయవాడ, విశాఖ మెట్రో రైల్ టెండర్లలో పాల్గొనేందుకు జాయింట్ వెంచర్స్ కు అవకాశం ఇచ్చామని తెలిపారు.. గరిష్టంగా 3 కంపెనీలు కలిసి జేవీగా టెండర్లు వేసుకునే అవకాశం ఉందన్నారు..
విశాఖలో ఇవాళ, రేపు ఈ-గవర్నెన్స్‌పై జాతీయ స్ధాయి సదస్సు నిర్వహిస్తోంది ప్రభుత్వం. సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో పాల్గొంటారు. విశాఖపట్నం డిక్లరేషన్ ఆన్ ఈ-గవర్నెన్స్ 2025ను ఈ సమావేశంలో ప్రకటించనుంది ఏపీ సర్కార్.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కీలక చర్చలు జరగనున్నాయి.. దాంతో, పలు సభలో కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం.. అసెంబ్లీలో నేడు వ్యవసాయ రంగంపై చర్చ జరగనుండగా.. వ్యవసాయ రంగంపై కీలక ప్రకటన చేయనున్నారు సీఎం చంద్రబాబు.
ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు.. విశాఖపట్నంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.. పెందుర్తి సుజాతానగర్ లో నివాసం ఉంటున్న మృతుడు సాయి మారుతి తండ్రి చంద్రశేఖర్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతూ ఉంటాడు.. అతని కుమారుడు సాయి మారుతి కెవిన్ కొంతకాలం హైదరాబాద్ లో సినిమా పరిశ్రమలో పనిచేసి, ఇటీవలే ఇంటికి వచ్చాడు.