Bhavani Diksha Viramana: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు భవాని దీక్షా విరమణలు జరగనున్న నేపథ్యంలో దేవస్థానం, పోలీసులు, వివిధ శాఖలు భారీ ఏర్పాట్లు చేపట్టాయి. ప్రతి ఏటా భవానీల సంఖ్య పెరుగుతుండటంతో ఈసారి మరింత విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.. భవానీలు ఇరుముడులు సమర్పించేందుకు మొత్తం మూడు హోమగుండాలు ఏర్పాటు చేశారు. భవానీలు 41 రోజులపాటు అనుసరించిన నియమ నిష్టలకు ముగింపు పలకబోతుండటంతో వేలాదిగా భక్తులు తిరిగి ఇంద్రకీలాద్రి చేరుతున్నారు.
Read Also: New Regional Alliance: భారత్‌పై కుట్రకు ప్లాన్ చేస్తున్న పాక్.. డ్రాగన్‌తో కొత్త కూటమికి సన్నాహాలు
ఈసారి, రాష్ట్రం నలుమూలల నుంచి 7 లక్షల మంది భవానీలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.. భక్తులకు మంచినీరు, నిత్యాన్న ప్రసాదం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.. 19 ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేసి రద్దీ లేకుండా.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.. మరోవైపు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.. 4,000 మంది పోలీసు సిబ్బంది భద్రతా ఏర్పాట్లు చేయనుండగా.. 370+ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు..
ఇక, భవానీల రద్దీ దృష్ట్యా డిసెంబర్ 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అన్ని అర్జిత సేవలను నిలిపివేశారు అధికారులు.. భక్తుల సౌకర్యార్థం గిరి ప్రదక్షిణ మార్గం వివరాలు అందించే విధంగా ‘భవాని దీక్ష 2025’ మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు. భవానీలు నిర్వహించే గిరి ప్రదక్షిణ 9 కిలోమీటర్ల మేర సాగనుంది. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, ఉచిత క్యూ లైన్లు, పెద్దపీఠాల సౌకర్యాలు అందుబాటులో ఉంచారు.