Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు.. సీఎం చంద్రబాబు చెప్పినట్లు పవన్ కల్యాణ్ వికృత క్రీడ ఆడుతున్నాడని నిప్పులు చెరిగారు.. చంద్రబాబు ఏం చెబితే పవన్ అదే మాట్లాడుతున్నారని ఆరోపించారు… పవన్ కల్యాణ్‌కు ఏది కావాలో.. చంద్రబాబు అది ఇస్తాడు.. కాబట్టే ఆయన చెప్పినట్టుగానే మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇక, కూటమి నేతలు దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దేవుడి పేరుతో రాజకీయాలు చెయ్యబట్టే చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా తిరుమలలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది చనిపోయారన్నారు. తిరుమలలో వెయ్యి కాళ్ల మండపాన్ని ఎవరు పడగొట్టారని పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు అంబటి రాంబాబు… గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది చనిపోతే.. పవన్ ఎందుకు ప్రశ్నించలేదు అని నిలదీశారు.. విజయవాడలో చంద్రబాబు గుళ్లు కూల్చేస్తే వైఎస్ జగన్ వాటిని తిరిగి కట్టించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో లోకేష్ అజ్ఞానుడు అనుకుంటే.. పవన్ కల్యాణ్ అంతకంటే అజ్ఞానుడిగా మారుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..