ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంపీ మిథున్ రెడ్డి సోదరుడి లాంటివారు.. ఎప్పుడూ నేనున్నానంటూ.. వెంటే ఉంటారని.. ఆ కక్ష తోనే కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది.. కొమ్మలను నరికిస్తే చెట్టు బలహీనమవుతుందనే మిథున్ రెడ్డిని ఆధారాలు లేకపోయినా అరెస్టు చేశారని ఆరోపించారు మదనపల్లి వైసీపీ ఇంఛార్జ్ నిస్సార్ అహ్మద్.
, అఖండ-2 విడుదల ఎప్పుడు అంటూ బాలయ్యను అడిగారు మంత్రులు, ఎమ్మెల్యేలు.. దీనిపై స్పందించిన బాలకృష్ణ ఎల్లుండి (సెప్టెంబర్ 25) తమ్ముడు పవన్ కల్యాణ్ ఓజీ సినిమా విడుదలవుతోంది.. అఖండ-2 డిసెంబర్ 5న విడుదలవుతోందని పేర్కొన్నారు.. పాన్ ఇండియా సినిమాగా వివిధ భాషల్లో అఖండ 2 సినిమాను తీసుకొస్తున్నాం. హిందీ డబ్బింగ్ కూడా చాలా బాగా వచ్చిందని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారని తెలిపారు..
శాసనసభ సమావేశాలకు దూరంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ... శాసన మండలిలో మాత్రం ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.. దీంతో, మండలిలో కూటమి వర్సెస్ వైసీపీగా మారింది పరిస్థితి.. ఇవాళ మండలిలో మంత్రి నారా లోకేష్ వర్సెస్ విపక్షనేత బొత్స సత్యనారాయణగా మారింది పరిస్థితి.
ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. దివ్య మంగళ స్వరూపుడై.. రకరకాల రూపాల్లో తనకిష్టమైన వాహనాలపై ఊరేగుతూ అభయాన్ని ప్రసాదిస్తుంటే ఆ భాగ్యాన్ని వర్ణించతరమా?. కేవలం బ్రహ్మోత్సవాలకు మాత్రమే ఆవిష్కృతమయ్యే అద్భుతం ఇది. రేపటి నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.. ఇవాళ రాత్రి 7 గంటలకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు..