Speaker Ayyanna Patrudu: మరోసారి హాట్ కామెంట్లు చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. పాసు పుస్తకాల పంపిణీ అనంతరం ఏర్పాటు చేసిన రైతు సమావేశంలో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు, ఈ పాసు పుస్తకాలు శాశ్వతమైనవని, వీటి పంపిణీ రాజకీయాలకు అతీతంగా జరగాలని సూచించారు. […]
న్యూఇయర్ వేడుకల్లో యువకుల మధ్య ఘర్షణ.. కత్తి, బీర్ బాటిళ్లతో దాడి.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పి. గన్నవరం మండలం ఉడిముడి (ఉడుముడి) గ్రామంలోని శివాలయం సమీపంలో కొంతమంది యువకులు చలిమంట కాగుతూ న్యూఇయర్‌ను స్వాగతించే ఏర్పాట్లు చేసుకున్నారు. అదే సమయంలో మరో వర్గానికి చెందిన యువకులు అక్కడకు వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడి గొడవకు దిగారు. ఒక యువకుడిని చాకుతో పొడిచారు.. మరొకరిపై పగిలిన బీర్ […]
Andhra Pradesh: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చేసింది కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కాస్తా.. వికసిత్ భారత్ రోజ్‌గార్, వికసిత్ భారత్ రోజ్‌గార్, అజీవికా హామీ మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G )గా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ.. మరోవైపు, ఉపాధి హామీ పథకానికి […]
Kanaka Durga Temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై VIP, VVIPలు సైతం దర్శనం కోసం తప్పనిసరిగా టికెట్ కొనుగోలు చేయాల్సిందే అని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. అమ్మవారి హుండీ ఆదాయాన్ని, ఆలయ నిర్వహణ నిధులను పెంచడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. సాధారణ రోజుల్లో సుమారు 30 వేల మంది, శుక్రవారం, శని, ఆదివారాల్లో ఈ […]
Gannavaram Airport: గన్నవరం విమానాశ్రయంలో రెండు ఇండిగో విమానాలు అత్యవసర పరిస్థితుల కారణంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఢిల్లీ నుండి హైదరాబాద్‌కు, అలాగే ముంబై నుండి హైదరాబాద్‌కు ప్రయాణిస్తున్న రెండు విమానాలను, హైదరాబాద్ వాతావరణ పరిస్థితులు అనుకూలం కాకపోవడంతో, విమానాశ్రయం అధికారులు గన్నవరం విమానాశ్రయంలో సురక్షిత ల్యాండింగ్ కు నిర్దేశించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలను ఈ రోజు ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది.. వాతావరణ పరిస్థితులు కారణంగా విమానాలు ప్రాధాన్యంగా భూమిపై సేఫ్‌గా దిగడానికి గన్నవరంను ఎంపిక […]
New Year Violence: న్యూ ఇయర్ వేళ ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి.. భారత్‌లో.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక ఈవెంట్లు, పార్టీలు.. ఇలా హుషారెత్తించారు.. ఈ సమయంలో లిక్కర్ సేల్స్ కూడా అమాంతం పెరిగిపోయిన విషయం విదితమే.. అయితే, నూతన సంవత్సర వేడుకలు కోనసీమలో విషాదంగా మారాయి. అర్ధరాత్రి యువకుల రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ హింసాత్మకంగా మారి, కత్తి మరియు బీర్ బాటిళ్లతో దాడులకు దారి తీసింది. ఈ ఘటనలో ఇద్దరు […]
Story Board: పాతికేళ్ల తెలుగు రాజకీయాలు తీవ్ర మార్పులకు లోనయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీ పోటీ నుంచి తెలంగాణ ఏర్పాటు , ఆపై ఏపీ, తెలంగాణలో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం వరకు పరిణామక్రమం సాగింది. ఉద్యమాలు, సంక్షేమ పథకాలు, డిజిటల్ ప్రచారం, మరియు రాజకీయ స్థిరత్వ చర్చలు ఈ కాలంలో కీలకంగా మారాయి. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి 2014 తెలంగాణ ఏర్పాటు వరకు ఉద్యమ రాజకీయాలు కీలక పాత్ర పోషించాయి. ఏపీలో టీడీపీ, వైసీపీల […]
Bitcoin Crash: బిట్‌కాయిన్ అంటేనే భారీ లాభాలు తెచ్చిపెట్టేదిగా చూస్తారు.. అయితే, 2025 సంవత్సరం క్రిప్టో కరెన్సీ మార్కెట్‌కు చాలా అస్థిరంగా ఉంది.. దీని వలన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మరియు అత్యంత ప్రసిద్ధ క్రిప్టో కరెన్సీ అయిన బిట్‌కాయిన్‌లో కూడా హెచ్చుతగ్గులు సంభవించాయి. బిట్‌కాయిన్ ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది.. ఆ తరువాత బాగా పడిపోయింది. బిట్‌కాయిన్ ఒకే సంవత్సరంలో 5 శాతానికి పైగా నష్టపోయింది.. కానీ, ఇప్పుడు నిపుణులు బిట్‌కాయిన్ 90 శాతం వరకు […]
ల్యాండ్ పూలింగ్‌కి భూములు.. రాజధాని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ఇటీవల ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చిన రాజధాని గ్రామాల అభివృద్ధికి చర్యలు ప్రారంభించింది ప్రభుత్వం.. రాజధాని అమరావతి జోన్-8 ప్రాంతంలోని 4 గ్రామాల్లో మౌలికవసతుల అభివృద్ధి కోసం టెండర్లు ఖరారు చేసింది.. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్‌కు స్వచ్ఛందంగా భూములిచ్చిన గ్రామాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. భూములు ఇచ్చిన రైతులు, గ్రామాల ప్రజలకు […]