"అసెంబ్లీలో ప్రస్తావించిన సమస్యను విని తక్షణమే స్పందించి పరిష్కరించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రివర్యులు పవన్ కల్యాణ్ గారికి నా ధన్యవాదాలు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనం.." అంటూ ట్వీట్.. ఇక, పవన్ కల్యాణ్ గారికి నా ధన్యవాదాలు. ప్రజా సమస్యలపై ఇంత వేగంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం మీలో ఉన్న సేవా తపనకు నిదర్శనం.." అంటూ మరో ట్వీట్ చేశారు బోండా ఉమామహేశ్వరరావు.
తిరుమల పరకామణి విషయంలో మంత్రి నారా లోకేష్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఎక్స్ (ట్విట్టర్)లో లోకేష్ కౌంటర్ గా ట్వీట్ చేసింది వైసీపీ.. "రాజకీయ ప్రయోజనాలకు తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం చంద్రబాబుకు, లోకేష్‌కు ఒక అలవాటుగా మారింది.. వెంకటేశ్వరస్వామి సాక్షిగా అబద్ధాలు, విషప్రచారాలు చేయడం వారిద్దరికీ అలవాటే. సిగ్గు, శరం వదిలేసి బరితెగించి విషప్రచారం చేయడంలో ఇద్దరూ హేమాహేమీలు. పరకామణిలో చోరీ విషయంలోనూ చంద్రబాబువి పచ్చి అబద్ధాలు.." అని మండిపడింది వైసీపీ..
నేను వచ్చిన వెంటనే చెత్త తొలగించా.. చెత్త నేతలను కూడా అలాగే తొలగిస్తాను అంటూ రౌడీషీటర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మాచర్లలో ఉండే రౌడీలు, ముఠా నాయకులు ప్రజల ఆస్తులను దోచేశారు. చరిత్రలో ఉన్న డిక్టేటర్లకు పట్టిన గతే వారికి పట్టిందన్నారు.. ఆత్మకూరు బాధితులను ఆదుకునేందుకు కూడా నన్ను రానివ్వకుండా నా ఇంటికి తాళ్లు కట్టారు. ఆరోజే చెప్పా... మీకు ఉరితాళ్లే అని.. మున్సిపల్ ఎన్నికలలో దౌర్జన్యం చేసినప్పుడే చెప్పా ఖబడ్దార్ అని గుర్తుచేశారు.
జోగి రమేష్ చేసిన ఆరోపణలకు అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. అసెంబ్లీ సమావేశాలలో NTPSలో బూడిద సమస్య గురించి నేను ప్రశ్న అడిగాను.. సోమవారం ఈ ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం అసెంబ్లీలో వస్తుందని తెలిపారు.. అయితే, జోగి రమేష్ దురదృష్ట వశాత్తూ రెండు సార్లు గెలిచారు.. NTPS బూడిద కాంట్రాక్టర్ తో కుమ్మక్కై జోగి ఇలా మాటాడుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు..
ఈ మధ్యే సీనియర్ ఐఏఎస్ అధికారులు.. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు.. వివిధ శాఖల అధిపతులను మారుస్తూ వచ్చిన కూటమి ప్రభుత్వం.. తాజాగా, మరో తొమ్మిది మంది IAS అధికారులను బదిలీ చేసింది..
అన్నదాతలు ఆందోళన చెందవద్దు.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం మాది అంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
నా లక్ష్యం ఒక్కటే.. అది, అందరికీ ఆదాయం పెరగాలి అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ అమలు చేశాం.. తల్లికి వందనం అందరు పిల్లలకు ఇచ్చాం.. ప్రజలే ఆస్థి.. మన పిల్లలే మన ఆస్థి.. అని పేర్కొన్నారు.. ఒకేసారి పదివేలకోట్లు నేరుగా ప్రజలకు ఇచ్చాం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం.. ఆడబిడ్డల సంక్షేమంకోసం అనేక కార్యక్రమాలు అమలు చేశాం..
అసెంబ్లీలో బోండా ఉమ క్వశ్చన్ ఓవర్ లో చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు ...శాఖా పరంగా ఎంక్వైరీ కికూడా ఆదేశించారు ...అసలు ఏ ఉద్దేశంతో బోండా ఉమా ఈ వ్యాఖ్యలు చేయవలసి వచ్చిందో పూర్తిస్థాయి విచారణ చేయమన్నారు...పవన్.. సీఎం దృష్టికి కూడా ఈ ఎపిసోడ్ తీసుకెళ్లాలని పవన్ సూచించారు. నెక్స్ట్ ఏం జరగబోతోంది..... విచారణ తర్వాత పరిస్థితి ఏ రకంగా ఉండబోతోంది..ఇదే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్. గా మారింది...