YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్ పీపీపీ మోడ్‌లో మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేయగా.. పీపీపీ మోడ్ అంటే.. మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయమే అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉద్యమాన్ని చేపట్టింది.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు, ర్యాలీలు చేసి.. కోటి సంతకాల సేకరణ చేపట్టింది.. ఇక, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 18న గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్నారు. ముందుగా సంతకాల ప్రతులను గవర్నర్‌కు డిసెంబర్ 17న అందజేయాలని వైసీపీ నిర్ణయించినా, షెడ్యూల్‌లో స్వల్ప మార్పుల నేపథ్యంలో ఈ నెల 18కి భేటీ వాయిదా పడింది. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల నుండి సేకరించిన సంతకాల పత్రాలు జిల్లా కేంద్రాలకు, అక్కడి నుండి విశాఖ నగర వైయస్సార్సీపీ కార్యాలయానికి చేరాయి. ప్రతి నియోజకవర్గ ఇంఛార్జ్‌లు సంతకాల పత్రాలను ఊరేగింపుతో పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చారు. విశాఖ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు మాట్లాడుతూ.. అంచనాలకు మించిన స్థాయిలో ప్రజలు సంతకాల సేకరణకు స్పందించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు మా పోరాటం కొనసాగుతుంది” అని తెలిపారు.
Read Also: Amit Shah: ఈవీఎంలను తీసుకువచ్చిందే రాజీవ్ గాంధీ, తొలిసారి గెలిచింది కాంగ్రెస్ పార్టీ..