క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ -ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు అంతా సిద్ధమైంది. 5 మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇప్పటికే కోహ్లి సేన, జో రూట్ బృందం సన్నద్ధమయ్యాయి. ఈ ఏడాది భారత పర్యటనలో ఇంగ్లండ్.. 3-1 తేడాతో సిరీస్‌ను చేజార్చుకుంది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది ఇంగ్లండ్. నాటింగ్ హాంలో జరిగే మ్యాచ్‌లో శుభారంభం చేసి కోహ్లీసేనపై ఒత్తిడి పెంచేందుకు స్కెచ్ వేస్తోంది ఇంగ్లీష్ టీమ్. అయితే కీలకమైన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, ఆర్చర్ […]
గుంటూరులో సంచలనం రేపిన రేవ్ పార్టీ వ్యవహారం పోలీసుల వ్యవహారశైలిని బయటపెట్టింది. లక్ష్మీపురంలోని ఓ బిల్డింగ్ నుంచి… అరుపులు, కేకలు వినిపించడంతో… విసిగిపోయిన స్థానికులు… అక్కడికి వెళ్లి చూశాడు. రేవ్ పార్టీ జరుగుతుండడంతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, అక్కడున్న పోలీస్ అధికారి… వారికి వార్నింగ్ ఇచ్చి పంపారు. ఇలా కాదనుకున్న స్థానికులు… ఆ బాగోతాన్ని వీడియో తీశారు. ఆ తర్వాత.. పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. పాతిక మంది గుంపు తమ ఇంటి దగ్గర రేవ్ […]
కరోనా పుట్టినిల్లు అయిన వుహాన్‌లో మళ్లీ వైరస్ కలకలం రేపుతోంది. దాదాపు ఏడాది తర్వాత వుహాన్‌లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో చైనాలో 84 కేసులు నమోదు కాగా.. అందులో ఎనిమిది మంది వుహాన్ వాళ్లే ఉన్నారు. వుహాన్‌లో బయటపడ్డ కేసుల్లో ముగ్గురిలో కరోనా లక్షణాలు ఉండగా.. ఐదుగురు అసింప్టమాటిక్ అని తేలింది. వీరందరినీ ఐసోలేషన్‌లో ఉంచడంతో పాటు వారి కాంటాక్ట్స్‌ను గుర్తిస్తున్నారు. అంతేకాకుండా వుహాన్‌లోని దాదాపు కోటి మంది జనాభాకు పరీక్షలు చేయాలని […]
భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతోంది. ఒలింపిక్స్ హాకీలో… క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో… ఆస్ట్రేలియాను ఓడించి… సంచలనం సృష్టించింది. మూడుసార్లు ఒలింపిక్ విజేత ఆస్ట్రేలియాను మట్టి కరిపించి… సెమీస్‌కు సిద్ధమైంది రాణి రాంపాల్ సేన. పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును క్వార్టర్స్‌లో ఓడించడంతో… మహిళల హాకీ జట్టుపై అందరికీ అంచనాలు పెరిగాయి. సెమీస్‌లోనూ అర్జెంటీనా జట్టును ఓడించి… ఫైనల్‌కు దూసుకెళ్లేందుకు వ్యూహాలు రచిస్తోంది. క్రీడాకారులందరూ సమష్టిగా రాణిస్తుండటంతో… రాంపాల్ సేనపై మరింత విశ్వాసం పెరిగింది. […]
ఏ ఒక్క పరిశ్రమను మూసి వేసే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు ఏపీ అటవీ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్.. పర్యావరణ నిబంధనలకు లోబడే పరిశ్రమలను నిర్వహించాలన్న ఆయన.. రెడ్ క్యాటగిరీ పరిశ్రమల్లో కాలుష్యస్థాయి ఏ రకంగా ఉందో తనిఖీలు చేస్తుంటాం.. దీనిలో భాగంగా ఈ ఏడాది జనవరిలో 54 పరిశ్రమలను తనిఖీ చేశాం.. చిత్తూరు జిల్లాలో అమరరాజాతో పాటు విశాఖ, కాకినాడ, కడప జిల్లాల్లో కాలుష్యకారకాలు ఎక్కువగా విడుదల చేస్తున్న పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు […]
కొత్త కొత్త చట్టాలు వచ్చినా.. కఠిన శిక్షలు పడుతున్నా… చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆడవారిపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే, మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో సంచలన తీర్పు వెలువరించింది నాంపల్లి కోర్టు… ఈ కేసులో హోంగార్డ్‌కు 30 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో తుకరాంగేట్‌లో ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేశారు మల్లికార్జున్ అనే హోం గార్డు.. కేసు నమోదు చేసిన పోలీసులు.. […]
తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసులు కాస్త పెరిగాయి.. 1,08,921 శాంపిల్స్ పరీక్షించగా… 609 మందికి పాజిటివ్‌గా తేలింది… మరో నలుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 647 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,46,606కు చేరగా… కోలుకున్నవారి సంఖ్య 6,34,018కి పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు […]
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం.. ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో లేనట్టే అని తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్… రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో చెప్పినట్లు 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని స్పష్టం చేశారు.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్.. కేంద్రానికి మనసుంటే మార్గం ఉంటుందన్నారు.. 2014 […]
మహబూబాబాద్ జిల్లా మరిపెడ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. తనపై అత్యాచారం చేశాడంటూ ట్రైనీ ఎస్సై ఆరోపించారు.. ఎస్సై శ్రీనివాస్‌రెడ్డిపై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీపీ తరుణ్ జోషి.. ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, తనను ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి లైంగికంగా వేధించినట్లు అదే పీఎస్‌కు చెందిన మహిళా ట్రైనీ ఎస్సై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.. సోమవారం రాత్రి ఆకస్మిక తనిఖీ పేరుతో ఒంటరిగా తనను […]
కరీంనగర్లో 9 గ్రానైట్ పరిశ్రమలకు నోటీసులు జారీ చేసింది ఈడీ.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదుతో నోటీసులు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశాలకు గ్రానైట్ ఎగుమతి చేశారని ఫిర్యాదు చేశారు బండి సంజయ్.. దీంతో రంగంలోకి దిగిన ఈడీ… ఎంత గ్రానైట్ ఎగుమతి చేశారో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. కాగా, కరీంనగర్ నుంచి కాకినాడ, కృష్ణపట్నం మీదుగా విదేశాలకు గ్రానైట్ ఎగుమతి చేసినట్లు […]