Gemini Horoscope: పరాభవనామ సంవత్సరంలో ‘మిధున రాశి’ ఫలితాలు.. అప్పటి వరకు మాట అదుపులో ఉంచుకోవాల్సిందే.!
- మిధున రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు
- ఆదాయం 8, వ్యయం 11 – ఆర్థికంగా జాగ్రత్త అవసరం
- డబ్బు పొదుపు, సరైన పెట్టుబడులు భవిష్యత్తుకు మేలు
- జూన్ వరకు గురు జన్మరాశిలో ఉండడంతో ఒత్తిడి, విభేదాలు వచ్చే అవకాశం
- జూన్ వరకు గురు జన్మరాశిలో ఉండడంతో ఒత్తిడి, విభేదాలు వచ్చే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gemini Horoscope: పరాభవనామ సంవత్సరంలో మిధున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. పరాభవనామ ఏడాదిలో ఆదాయం 8, వ్యయం 11. అలాగే రాజపూజ్యం 1, అవమానం 7. అంటే ఏవైతే కావాలో అవి తక్కువగా ఉన్న కారణంగా కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మండిచింది. ముఖ్యంగా ఆర్థిక విషయం విషయాల్లో మనం ఎక్కువగా ప్లానింగ్, ప్రీ ప్లానింగ్ అవసరం. ఇప్పటివరకు సంపాదించిన డబ్బుని పొదుపు సూత్రంగా వాడడం మంచిది. వాటిని మంచి పెట్టుబడుల్లో పెట్టడం వల్ల వారికి భవిష్యత్తు బంగారుమయంగా మారుతుంది.
ఇంకా సమాజంలో మనం మెలిగేటప్పుడు జాగ్రత్తగా అందరి తలలో నాలికలాగా ఉండాలి. అంటే ఎవరితోటూ విభేదించకూడదు. దీనికి కారణం 7 అవమానం చూపిస్తుంది. ఒకటి మాత్రమే రాజపూజ్యం. ఇక ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే.. ఈ సంవత్సర ప్రారంభం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ, జూన్ నుండి అద్భుతమైన ఫలితాలు ఉండనున్నాయి. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు వీరికి అనుకూలిస్తాడు. అక్కడ నుండి గురుబలం ఉన్న కారణం చేత సమస్తమైనటువంటి శుభాలు అందుతాయి.
Also Read
- Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
- 29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
- Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
- India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
Chris Gayle IPL Record: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటికీ నంబర్ వన్‌గా గేల్.. రోహిత్, కోహ్లీ, ధోనీలకు కష్టమే!
ఆర్థికంగా, అలాగే కుటుంబ పరంగా, అదేవిధంగా విద్యార్థులకి ఈ దైవబలం ఉన్న కారణం చేత వారికి కూడా తర్వాతి అకాడమిక్ ఇయర్ అంతా బాగుంటుంది. ఇక విదేశీ ప్రయత్నాలకి ప్రయత్నం చేసే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంకా వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఏవైతే ఆదాయ మార్గాల కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. జూన్ 2 వరకు గురువు జన్మరాశిలో ఉంటారు. జన్మరాశిలో ఉన్నప్పుడు వృత్తిలో ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. దీని వల్ల అనేక రకాలుగా గొడవలు, మనస్పర్ధలు వస్తాయి. అవి రాకుండా ఉండేందుకు జూన్ వరకు గురువు జన్మరాశిలో ఉన్నాడు కాబట్టి.. గురు ధ్యానం చేసుకోవడం మంచిది.
ఇక జూన్ తర్వాత గురువు ధనస్థానంలోకి మారడం ద్వారాగా అది కూడా ఉచ్చస్థానం అవ్వడం ద్వారా వారికి అనేక రకాలుగా ఆర్థిక సమస్యలు ఏవైతే గతంలో పొంది ఉన్నారో అవన్నీ తొలుగుతాయి. క్రమంగా చేతిలో డబ్బు నిలుస్తుంది. కుటుంబంలో ప్రశాంతత నిలకొంటుంది. శని రాజ్యస్థానంలో ఉన్న కారణం చేత బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతాయుతంగా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించడం ద్వారా గుర్తింపు లభిస్తుంది.
8.12 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 200MP కెమెరాతో OPPO Find N6 లాంచ్.. ధర ఎంతంటే?
పనిభారం ఉన్నప్పటికీ సరైన ప్రతిఫలం కూడా ఉంటుంది. అంటే శ్రమకు తగ్గినటువంటి ఫలితాలు కూడా బాగుంటాయి. అలాగే కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక రాహు విషయానికి వస్తే.. రాహు అష్టమంలో ఉన్న కారణం చేత ఆరోగ్య విషయంలో వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ముందుకు సాగాలి. అలాగే కేతువు తృతీయంలో ఉండడం వల్ల ధైర్య సాహసాలు పెరుగుతాయి. స్వయం కృషితో పైకి వస్తారు. డిసెంబర్ నుండి కేతువు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల మాట్లాడేటప్పుడు మనం ఆలోచించి మాట్లాడాలి. జాగ్రత్తగా మనం అన్ని తెలుసుకున్న తర్వాతనే మనం మాట ఇవ్వాలి.
అక్టోబర్ తర్వాత గురువు మూడవ రాశిలోకి ప్రవేశించడం ద్వారాగా శని అనుకూలత వృత్తిపరంగా కాపాడుతుంది. అలాగే ఇక్కడ జూన్ నుండి అక్టోబర్ మధ్యలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులు ఉత్తరార్థంలో విద్యను సంపూర్ణంగా అభ్యసిస్తారు. ఆశించిన ఫలితాలు లభిస్తాయి. విదేశీ యోగాలకు అనుకూలమైనటువంటి కాలంగా ఈ మిధున రాశి వారికి గోచరిస్తోంది. కారణం ద్వితీయంలో ఉన్నటువంటి గురుబలం ఇక జీవిత ఆశయం నెరవేరుతుంది. ఈ సంవత్సరము మిధున రాశి వారు జూన్ వరకు గురుధ్యాన శ్లోకాలు చదువుకోవడం ఆ తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం ద్వారాగా వారికి మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి.
తాజావార్తలు
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
ట్రెండింగ్
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!