ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. కృష్ణ నది జలాలతో పాటు.. గోదావరి జలాల విషయంలోనూ కొన్ని వివాదాలు ఉండగా… ఈ వివాదాలకు తెరదించాలన్న ఉద్దేశంతో… రెండు బోర్డుల అధికారాలు, పరిధిలను నిర్ణయిస్తూ.. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.. అయితే, దీనిపై భిన్నమైన వాదనలు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. ఈనెల 9వ తేదీన గోదావరి నది యాజమాన్య బోర్డు పూర్తిస్థాయి అత్యవసర సమావేశం జరగనుంది… కేంద్ర జనశక్తి మంత్రిత్వ […]
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు సీఎం కేసీఆర్.. ఇవాళ ఆ గ్రామంలో విస్తృతంగా పర్యటించారు.. దళిత వాడల్లోని సుమారు 60 ఇళ్లోకి వెళ్లి కాలినడకన పర్యటిస్తూ ప్రతి ఒక్కరినీ యోగక్షేమాలు, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతే కాదు.. సీఎం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళిత బంధు పథకం కూడా అక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్టు.. రేపటి నుంచి వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నాం. […]
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప శకం ముగిసినట్టేనా? అనే చర్చ మొదలైంది… ఆయనకు ఊహించని షాక్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం.. ఎందుకంటే.. తన కుమారుడు విజయేంద్రకు కర్ణాటక డిప్యూటీ సీఎం పదవి ఇప్పించాలని, లేదంటే మంత్రి పదవితో పాటు కీలకమైన శాఖలు అప్పగించాలని అనేక ప్రయత్నాలు చేశారు.. కానీ, ఆయనకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 29 మంది మంత్రుల్లో తన కొడుకు కూడా ఒక్కడిగా ఉంటాడని ఊహించుకున్న […]
భారత్-పాక్ సరహిద్దులతో మొదట కలలం సృష్టించిన డ్రోన్లు.. ఆ తర్వాత జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై దాడికే ఉపయోగించారు.. ఇక, అప్పటి నుంచి ఎక్కడ డ్రోన్లు కదలినా.. అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఇవాళ ఎర్రకోట సమీపంలో డ్రోన్ ఎగరడంతో కలకలమే రేగింది.. వెంటనే ఆ డ్రోన్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రకోట వెనుక భాగంలో విజయ్ ఘాట్ మీదుగా డ్రోన్ ఎగిరింది.. ఈ ప్రాంతంలో వెబ్ సిరీస్ షూటింగ్‌కు పోలీసులు అనుమతి ఇచ్చినా.. డ్రోన్‌కు మాత్రం అనుమతి లేదు.. […]
తెలంగాణ రోజువారి పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 623 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. మరో ముగ్గురు కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 594 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు… దీంతో.. ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,47,229కు పెరగగా… రికవరీ కేసుల సంఖ్య 6,34,612కు చేరింది… మరోవైపు.. రాష్ట్రంలో […]
ఈ నెల 8వ తేదీన నల్గొండ జిల్లాలో జరిగే సభ చరిత్ర సృష్టిస్తుందన్నారు మాజీ ఐఏఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఈ నెల 8న ఆయన బీఎస్పీలో చేరనున్న సందర్భంగా నార్కట్ పల్లి మండలంలో ముఖ్యకార్యకర్తలు, అనుచరులతో సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో జరిగే సభతో చరిత్ర సృష్టించబోతున్నాం.. కుమారి మాయావతిని భారత ప్రధానిగా చేయడానికి నల్గొండలో జరిగే బహిరంగ సభ కీలకం కానుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బహుజనుకి రాజ్యాధికారం […]
ప్రపంచంలో ఉన్న టాప్ బెస్ట్ సిటీల్లో హైదరాబాద్ ఒకటి.. మూడు వేల యాక్టివ్ వైఫై హాట్ స్పాట్స్ హైదరాబాద్‌ని గ్లోబల్ స్మార్ట్ సిటీగా మార్చడానికి పనిచేస్తున్నాయని తెలిపారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ప్రభుత్వం ప్రారంభించిన హై-ఫై ప్రాజెక్ట్‌లో భాగంగా హైదరాబాద్‌లో 3000కు పైగా పబ్లిక్ వై-ఫై హాట్స్పాట్లు ఏర్పాటు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఫైబర్ నెట్‌తో ప్రజలు స్పీడ్ ఇంటర్నెట్ పొందుతున్నారు.. ఫైబర్ నెట్‌తో ప్రభుత్వం భాగస్వామ్యం […]
నూతన విద్యా విధానంపై అందరిలోనూ అవగాహన తీసుకురావాలని.. ఈ విధానం ద్వారా తీసుకు వస్తున్న విప్లవాత్మక మార్పులు వల్ల పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్ల ఉంటారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ సీఎం కవైఎస్ జగన్.. క్యాంపు కార్యాలయంలో ఇవాళ నూతన విద్యావిధానంపై సమీక్ష నిర్వహించిన ఆయన.. నూతన విద్యా విధానంలో స్కూళ్లను ఆరు రకాలుగా వర్గీకరించాలని ఖరారు చేశారు.. స్టూడెంట్, టీచర్ రేష్యో పై తయారు చేసిన ప్రతిపాదనలను సీఎంకు వివరించిన అధికారులు.. శాటిలైట్ స్కూల్స్ ( పీపీ–1, […]
తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు… దళిత బంధు పథకం అమలుకు ఇప్పటికే సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. అయితే, మొదటగా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పథకాన్ని అమలు చేయడానికి పూనుకున్నారు.. దానిపై కొన్ని రాజకీయ విమర్శలు లేకపోలేదు.. కానీ, రేపటి నుంచే దళిత బంధు పథకం ప్రారంభం కానున్నట్టు ప్రకటించారు.. సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ భారీగా పెరిగాయి.. ఇదే సమయంలో టెస్ట్‌ల సంఖ్య కూడా పెంచారు. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 85,822 శాంపిల్స్ పరీక్షించగా.. 2,442 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 16 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో.. 2,412 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. తాజా మృతుల్లో చిత్తూరులో ఐదుగురు, అనంతపురం, కృష్ణా, నెల్లూరు […]