ఢిల్లీకి పయనం అవుతుంది బీజేపీ ఏపీ టీమ్… రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో.. హస్తినకు వెళ్లనున్నారు పార్టీ నేతలు.. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్న నేతలు.. పలువురు కేంద్ర మంత్రులను కలవడంతో పాటు.. పార్టీ పెద్దలతో కూడా సమావేశం కానున్నారు.. ఈ పర్యటనలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసి ఏపీ ఆర్ధిక పరిస్థితులపై ఫిర్యాదు చేయనున్నారు సోము వీర్రాజు.. ఇక, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర […]
శ్రీశైలం డ్యామ్‌కు క్రమంగా వరద తగ్గుతూ వస్తోంది… ఇన్‌ఫ్లో 3 లక్షల క్యూసెక్కుల దిగవకు పడిపోయింది.. అయినా.. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు… ఇన్ ఫ్లో 2,83,141 క్యూసెక్కులుగా ఉండగా… ఔట్ ఫ్లో 3,65,487 క్యూసెక్కులుగా ఉంది… ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883.60 అడుగులుగా ఉంది… పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు […]
తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడికి షాక్ ఇచ్చింది యువతి.. అతడిని స్కూటీని డ్రైనేజీలోకి తోసేసి.. మరీ బుద్ధిచెప్పింది.. అసోంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భావన కశ్యప్ అనే యువతి సాయంత్రం టైంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. స్కూటీపై వచ్చిన ఓ యువకుడు ఆమె ముందు ఆపి.. ఏదో అడ్రస్ అడిగారు.. తనకు తెలియదని ఆ యువతి బదులివ్వగా.. కొంచెం ముందుకెళ్లి.. మళ్లీ వెనక్కి వచ్చిన ఆ పోకిరీ.. మళ్లీ […]
పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది… త్రిపురలో పర్యటిస్తున్నారు అభిషేక్ బెనర్జీ.. అయితే, ఆయన కాన్వాయ్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడికి పాల్పడ్డారు.. వారు బీజేపీ జెండాలను పట్టుకుని ఉన్నారు.. అయితే, తనపై దాడికి పాల్పడింది బీజేపీ నేతలేనంటూ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు అభిషేక్ బెనర్జీ.. బీజేపీ నాయకత్వంలోని త్రిపురలో ప్రజాస్వామ్యం ఇలా ఉంది అంటూ మండిపడ్డ ఆయన.. విప్లవ్ దేవ్ మీరు […]
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా కిందికి దిగివస్తున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 1,07,472 శాంపిల్స్‌ను పరీక్షించగా 591 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో.. 643 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,45,997కు పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 6,33,371కు చేరింది.. […]
కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి వచ్చింది లేదు.. మరోవైపు థర్డ్ వేవ్ భయలు వెంటాడుతున్నాయి.. ఇక, కొత్త కొత్త వేరియంట్లు వెలుగుచూస్తూనే ఉన్నాయి… మరోవైపు కేరళ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే జికా వైరస్ కేసులు నమోదు కాగా.. ఇప్పుడు మహారాష్ట్రలో జికా వైరస్ కేసు వెలుగు చూసింది.. దీంతో.. దానిపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్రం.. వెంటనే కొంత మంది వైద్య నిపుణుల బృందాన్ని మహారాష్ట్రకు పంపించింది.. జికా వైరస్, అక్కడి పరిస్థితులపై ఆ వైద్య […]
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది… కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ దాదాగిరి చేస్తుందంటూ వ్యాఖ్యానించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అయితే, ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ కౌంటర్ ఎటాక్‌కు దిగారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కృష్ణా జలాల వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసు అన్నారు.. ఇక, దాదాగిరి ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్న సజ్జల… కేంద్ర జలశక్తి శాఖ […]
నగదు లావాదేవీలకు క్రమంగా స్వస్తి చెబుతూ.. డిజిటల్ పేమెంట్స్ వైపు అడుగులు వేస్తోంది భారత్.. ఇక, డిజిటల్ పేమెంట్స్‌ను మరింత ప్రోత్సహించే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం.. అందులో భాగంగా.. ఎలక్ట్రానిక్ వోచర్ ఈ-రూపీని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోడీ… వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈరూపీ వోచర్‌ను రిలీజ్ చేశారు ప్రధాని… డిజిటల్ లావాదేవీలు, నేరుగా నగదు బదిలీ విషయంలో దేశంలో ఈరూపీ కీలకపాత్ర పోషిస్తుందని వెల్లడించారు. పారదర్శకంగా ఎటువంటి లీకేజీలకు అవకాశం లేకుండా నగదును […]
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని ఇప్పటికే స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.. అయితే, విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ సాధించుకున్న ఈ పరిశ్రమ ప్రైవేటీకరణకు ఒప్పుకునేది లేదంటున్నాయి అన్ని పార్టీలు.. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేశాయి… విశాఖ నుంచి ఇప్పుడు ఆందోళన ఢిల్లీ వరకు చేరింది… బీజేపీ మినహా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు.. ఈ ఆందోళనలో పాలుపంచుకుంటున్నాయి.. అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై […]
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి అసలైన ప్రతిపక్షం తామేనని.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టబోతున్నట్టు బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.. అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణుల్లో ఊపుతెచ్చేందుకు.. కొత్తవారిని ఆకర్షించేందుకు ప్లాన్ చేస్తున్నారు.. ప్రజలతో మమేకం అవుతూ.. సమస్యలు తెలుసుకుంటూ.. పాదయాత్ర నిర్వహించాలని తలపెట్టారు బీజేపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. అయితే, ప్రస్తుతానికి ఆయన పాదయాత్ర వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9వ తేదీ నుంచి […]