ఎయిరిండియా బిడ్ దక్కించుకుంది టాటా సన్స్.. ఎయిరిండియాపై కాసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది… రూ.18 వేల కోట్ల ఓపెన్ బిడ్‌తో ఎయిరిండియాను సొంతం చేసుకుంది.. దీంతో 68 ఏళ్ల తర్వాత తిరిగి ఎయిరిండియా.. టాటాల చేతిలోకి వెళ్లింది… అయితే, టాటా సన్స్ అధినేత జహంగీర్ రతన్ జీ దాదాబాయ్ టాటా.. భారత్‌లో విమానయాన సర్వీసులను ప్రారంభించారు.. 1938లో విదేశాలకు కూడా విమాన సర్వీసులను విస్తరించారు.. మొదట టాటా ఎయిర్ సర్వీసెస్ గా ఉండగా.. ఆ తర్వాత టాటా ఎయిర్‌లైన్స్‌గా మార్చారు.. కొన్ని క్లిష్టమైన సమయాల్లోనూ టాటా ఎయిర్‌లైన్స్ బాసటగా నిలించింది.
అయితే, 1953లో టాటా సన్స్ నుంచి విమాన సర్వీసులను జాతీయకరణ చేశారు.. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత దాని పేరు ఎయిరిండియాగా మారిపోగా.. ఎయిరిండియాలో 49 శాతం వాటాను కొనుగోలు చేసింది కేంద్ర ప్రబుత్వం… ఇక, 1953లో దానిని జాతీయం చేసి టాటా సన్స్ నుంచి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకుంది.. అయితే, క్రమంగా నష్టాలను చవిచూస్తూ వచ్చింది ఎయిరిండియా.. దీంతో.. ప్రైవేట్‌కు అప్పగించడమే సరైనదే నిర్ణయానికి వచ్చింది సర్కార్.. సంస్థపై క్రమంగా రుణ భారం పెరిగిపోవడంతో.. కేంద్రం వ్యూహాత్మకంగా 100 శాతం వాటాల ఉపసంహరణకు 2020లో బిడ్లను ఆహ్వానించింది. ఇందులో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 100 శాతం వాటా, ఎయిర్ ఇండియా సాట్స్ 50 శాతం వాటా ఉంది. అయితే, నాలుగు సంస్థలు బిడ్లు దాఖలు చేసినా.. ఫైనల్‌గా స్పైస్‌జెట్, టాటా సన్స్ చివరి వరకు పోటీ పడుతూ వచ్చాయి.. చివరకు రూ.18 వేల కోట్ల ఓపెన్ బిడ్‌తో ఎయిరిండియాను తిరిగి టాటా సన్స్ దక్కించుకుంది.. దీంతో.. 68 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టాటా చేతికి వెళ్లిపోయింది ఎయిరిండియా.. అయితే, ఈ ప్రక్రియ మొత్తం డిసెంబర్‌లో ముగిసే అవకావం ఉందని చెబుతున్నారు అధికారులు.