ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ భారీగా పెరిగాయి.. ఇదే సమయంలో టెస్ట్‌ల సంఖ్య కూడా పెంచారు. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 85,822 శాంపిల్స్ పరీక్షించగా.. 2,442 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 16 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో.. 2,412 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. తాజా మృతుల్లో చిత్తూరులో ఐదుగురు, అనంతపురం, కృష్ణా, నెల్లూరు […]
తెలంగాణ సీఎం కేసీఆర్.. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించారు… సుమారు 3 గంటలపాటు ఆయన పర్యటన కొనసాగింది.. దళిత కుటుంబాల మహిళలు కేసీఆర్‌కు బొట్టు పెట్టి స్వాగతం పలికారు.. దళిత వాడల్లోని సుమారు 60 ఇళ్లోకి వెళ్లి కాలినడకన పర్యటిస్తూ ప్రతి ఒక్కరినీ యోగక్షేమాలు, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. మొదట దళిత వాడల్లో పర్యటించిన ముఖ్యమంత్రి.. ఇండ్లు లేని వారందరికీ డబల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు […]
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆదేశించింది హైకోర్టు.. సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ విక్రయాలు జరుగుతున్నట్టు తరచూ మా దృష్టికి వస్తున్నాయని పేర్కొన్న హైకోర్టు… 33 జిల్లాల్లో కలెక్టర్లు వెంటనే సర్వే పనులు చేపట్టి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని.. ప్రభుత్వ భూములను గుర్తించి, జియో సర్వే వివరాలతో రికార్డుల్లో నమోదు చేయాలని స్పష్టం […]
కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. మందు తయారు చేసి వార్తలఎక్కారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య… అయితే, కరోనా థర్డ్ వేవ్ కూడా మందు తయారు చేస్తానంటున్నారు ఆనందయ్య… థర్డ్ వేవ్ లక్షణాలు చూసి తర్వాత.. దానికి కూడా మందు తయారు చేయనున్నట్టు వెల్లడించారు.. మరోవైపు.. నా మందుకు ఇక పేరు పెట్టను అని ప్రకటించారాయన… ఎందుకంటే.. ఆనందయ్య మందుగానే అది అందరికీ పరిచయం అయ్యిందని.. ఇక పేరు పెట్టాల్సిన అవసరం లేదన్నారు ఆనందయ్య. ఎవరు […]
తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో పార్టీని స్థాపించి సమస్యలపై పోరాటం చేస్తున్నారు ఆ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల… ముఖ్యంగా నిరుద్యోగుల సమస్యలపై ఫోకస్ పెట్టారు… ప్రతీ మంగళవారం ఒక ప్రాంతంలో దీక్ష చేస్తూ వస్తున్నారు.. తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా చెబుతున్న ఆమె.. రాజన్న యాదిలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఊరూరా వైయస్ఆర్ జెండా పండుగ నిర్వహించాలని నిర్ణయించారు.. ఆగస్టు 5వ తేదీ నుంచి జెండా పండుగ నిర్వహించాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు వైఎస్ […]
సాహిత్యంలో దైవత్వాన్ని పొందిన తొలి ధార్మిక గ్రంథం భగవద్గీత.. మహాభారతంలోని భాగమైనా ఉపనిషత్తు స్థాయిని పొందిన కావ్య ఖండం. భారతీయ సంస్కృతి, సంస్కారాలను ప్రభావితం చేసిన జ్ఞాన ప్రవాహం. భీష్మపర్వంలోని 25 వ అధ్యాయం నుంచి 42 వ అధ్యాయం వరకు ఉన్న 700 శ్లోకాలకు భగవద్గీత అని పేరు.. అయితే, తొలిసారి భక్తి టీవీ 700 శ్లోకాల సంపూర్ణ పారాయణ యజ్ఞం చేస్తోంది… భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎల్వీ గంగాధర శాస్త్రి గారి ఆధ్వర్యంలో.. […]
పార్టీ శ్రేణుల సంక్షేమం కోసం.. పార్టీ సభ్యులకు ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది టీఆర్ఎస్.. పార్టీ సభ్యత్వం ఉన్నవారు ఎవరైనా మృతిచెందితే వారికి ఇన్సూరెన్స్ అందిస్తూ వస్తున్నారు.. వివిధ కారణలతో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు ఇవాళ తెలంగాణ భవన్లో ఇన్సూరెన్స్ చెక్కులు అందించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. 80 మందికి రెండు లక్షల రూపాయల చొప్పున ఇన్సూరెన్స్ చెక్కులు అందజేశారు.. ఈ సంవత్సరం పార్టీ మొత్తం కార్యకర్తలకు 18 కోట్ల రూపాయల ప్రీమియం డబ్బులను ఇన్సూరెన్స్ […]
అమర రాజా ఫ్యాక్టరీ వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది… ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అమర రాజా ఫ్యాక్టరీని వెళ్లిపొమ్మని మేం చెప్పలేదన్నారు.. తిరుపతిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు, కాలుష్య నియంత్రణ మండలి లేవనెత్తిన అభ్యంతరాలను సరి చేసుకుని అమర రాజా ఫ్యాక్టరీ ఇక్కడే కొనసాగవచ్చు అన్నారు.. ఇక, పరిశ్రమలు తరలిపోవాలని మేం కోరుకోం అని స్పష్టం చేశారు. […]
యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో బుధవారం పర్యటించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.. అయితే, ఈ కార్యక్రమానికి మీడియాకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు.. తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రికి ఉదయం చేరుకోనున్న సీఎం.. గ్రామంలో పర్యటించనున్నారు.. రైతు వేదికలో గ్రామస్థులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సుమారు 120 మందితో సమావేశం కానున్నారు.. మొదట ముఖ్యమంత్రి గ్రామంలోని దళిత వాడలో పర్యటిస్తారు.. యాబై మందితో కలిసి దళితవాడను పరిశీస్తారు సీఎం.. ఆ తర్వాత రైతు వేదికలో 120 […]
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ -ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు అంతా సిద్ధమైంది. 5 మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇప్పటికే కోహ్లి సేన, జో రూట్ బృందం సన్నద్ధమయ్యాయి. ఈ ఏడాది భారత పర్యటనలో ఇంగ్లండ్.. 3-1 తేడాతో సిరీస్‌ను చేజార్చుకుంది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది ఇంగ్లండ్. నాటింగ్ హాంలో జరిగే మ్యాచ్‌లో శుభారంభం చేసి కోహ్లీసేనపై ఒత్తిడి పెంచేందుకు స్కెచ్ వేస్తోంది ఇంగ్లీష్ టీమ్. అయితే కీలకమైన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, ఆర్చర్ […]