జల వివాదంలో తెలుగు రాష్ట్రాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఫిర్యాదులు, కేసులు.. ఇలా ముందుకు వెళ్తున్న తరుణంలో.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.. తాము తెలంగాణతో సఖ్యత కోరుకుంటున్నాం… అన్నదమ్ముల్లా ఉండాలని మా కోరిక… తగవు పడాలనే ఆలోచనే మాకు లేదన్నారు బొత్స.. ఆంధ్ర ప్రజలను సొంత అన్నదమ్ముల్లా చూసుకుంటానని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇది వరకు చెప్పారని గుర్తుచేసిన ఆయన.. అలా అన్నారో లేదో ఆయనే చెప్పాలన్నారు.. ఇక, […]
కరోనా సెకండ్ వేవ్ తగ్గనేలేదు.. థర్డ్ వేవ్ ప్రారంభమైపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.. అయితే, మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో ఏకంగా కోవిడ్ ఫోర్త్ వేవ్ స్టార్ట్ అయిపోయిందట.. పాజిటివ్ కేసుల సంఖ్య చాలా వేగంగా పెరిగిపోతోంది.. డెల్టా వేరియంట్ కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో.. అప్రమైంది పాక్ ప్రభుత్వం… కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ది నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్ (ఎన్సీవోసీ) కొత్త మార్గదర్శకాలను కూడా తాజాగా విడుదల చేసింది. […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. అయితే, గత బులెటిన్‌తో పోలిస్తే.. తాజా బులెటిన్‌లో టెస్ట్‌ల సంఖ్య పెరిగింది.. కానీ, పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం ఎటూ కదలలేదు.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 69,606 శాంపిల్స్ పరీక్షించగా 1,546 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 18 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. చిత్తూరులో నలుగు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపురం, తూర్పు […]
వర్క్ ఫ్రమ్ హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. ఇవాళ ఐటీ, డిజిటల్ లైబ్రరీలపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి గ్రామ పంచాయితీలోనూ డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేయాలన్నారు.. అక్కడ నుంచే పని చేసుకునే సదుపాయం ఉంటుందని.. మొదటి విడతలో 4530 డిజిటల్ లైబ్రరీలను నిర్మించాలని.. ఆగస్టు 15న పనులు మొదలుపెట్టేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఆలోగా స్థలాలు గుర్తించి […]
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికార లక్ష్యంగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ… ఈ మధ్యే ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పీసీసీ చీఫ్ పదవితో పాటు.. వివిధ కమిటీలను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం.. ఇక, కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చిందనే టాక్ నడుస్తోంది.. మరోవైపు.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు కొత్త బాధ్యతలు అప్పగించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… వారికి పార్లమెంట్ స్థానాల వారీగా పని విభజన చేశారు. ఈ […]
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నా.. ఇంకా కొన్ని చోట్ల పెద్ద సంఖ్యలోనే కేసులు వెలుగుచూస్తున్నాయి… నిన్నటి బులెటిన్‌లో జీహెచ్ఎంసీలో కంటే.. కరీంనగర్‌లోనే అత్యధిక కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. జిల్లా యంత్రాంగం అప్రమత్తం అవుతోంది… జిల్లాలో కరోనా ఉధృతిపై మీడియాతో మాట్లాడిన కలెక్టర్ ఆర్వీ కర్ణన్… కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రజల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.. అంతా తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని, మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు.. ఎలాంటి ఆరోగ్య […]
ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ వేర్వేరు కాదు.. అవసరం అయినప్పుడల్లా బీజేపీకి టీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆరోపించారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… మోడీ వ్యతిరేక శక్తుల సమీకరణ కోసం ఇవాళ రాహుల్ గాంధీ సమావేశం ఏర్పాటు చేశారు.. ఆ సమావేశానికి 14 ప్రతిపక్ష పార్టీలు వచ్చాయని తెలిపారు. నీళ్ల విషయంలో కేంద్రం.. తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తోందని ఆరోపించారు రేవంత్‌రెడ్డి… ఏపీ దాదాగిరి చేస్తుందని కేసీఆర్ అన్నారని.. కానీ, ఈ పార్లమెంట్ […]
టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. జాతీయ విద్యావిధానం అమలుపై ఎమ్మెల్సీల అభిప్రాయాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు.. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పటిష్టతకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు, అమలవుతున్న పథకాలను ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభినందించినట్టుగా తెలుస్తోంది.. ఇక, జాతీయ విద్యావిధానం అమలుపై పలు సలహాలు సూచనలు చేశారు టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు. ఈ సమావేశంలో శాసన మండలి ప్రొటెమ్ ఛైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. […]
గ్రూప్ రాజకీయాలకు భారతీయ జనతా పార్టీలో స్థానం లేదని స్పష్టం చేశారు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ… మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో బీజేపీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.. పార్టీ కార్యకర్తలకు, సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆమె.. గ్రూప్ రాజకీయాలకు బీజేపీలో స్థానం లేదు… పార్టీ కోసం కష్ట పడే ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు […]
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మళ్లీ హీట్ పెంచుతోంది పొలిటికల్ ఫైట్… మరోసారి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిగా మారింది పరిస్థితి… ప్రతీ విషయంలోనూ ఈ ఇద్దరు నేతల మధ్య యుద్ధమే నడుస్తుండగా.. తాజాగా.. మరో వివాదం చోటు చేసుకుంది.. ఇవాళ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడానికి వెళ్లారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి… ఇదే సమయంలో మున్సిపల్ అధికారులను, సిబ్బందిని తీసుకుని నగరంలో పర్యటించారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. దీంతో.. అధికారులు, […]