తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి మీడియా ముందుకు రానున్నారు.. కరోనా సమయంలో కేసీఆర్ ప్రెస్‌మీట్ పెడుతున్నారంటే.. ఆయన ఏం చెబుతారు..? ఎలాంటి ఆంక్షలు పెడతారు..? కేసుల పరిస్థితి ఏంటి? అనేదానిపై అంతా ఆసక్తిగా ఎదురుచూసేవారు.. ఇప్పుడు మళ్లీ కోవిడ్ విజృంభిస్తోంది.. ఓవైపు ఒమిక్రాన్.. మరోవైపు డెల్టా కేసులు వరుసగా పెరుగుతూ పోతున్నాయి.. ఈ నేపథ్యంలో.. కోవిడ్ తాజా పరిస్థితి, మహమ్మారి విజృంభిస్తే.. ఎదుర్కోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్.. ప్రగతి భవన్లో […]
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్ దాడి కలకలం సృష్టిస్తోంది… డ్రోన్ దాడులకు తమ పనేనని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ ఉగ్రవాదులు ఓ ప్రకటనలో వెల్లడించగా.. ఈ డ్రోన్ దాడిలో మూడు అయిల్ ట్యాంకర్లు పేలిపోయినట్టు అధికారులు తెలిపారు.. అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లోని ఇంధనం వాహక ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు సమాచారం. సెప్టెంబరు 14, 2019న సౌదీ అరేబియాలోని రెండు కీలక చమురు స్థావరాలపై యెమెన్‌కు చెందిన హౌతీ […]
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం.. వివిధ రాజకీయ పార్టీల నుంచి విజ్ఞప్తులు రావడంతో.. ఫిబ్రవరి 14వ తేదీన జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరి 20వ తేదీన నిర్వహించాలని నిర్ణయించినట్టు ఈసీ ప్రకటించింది.. ఎన్నికలు వాయిదా వేయడానికి ప్రధాన కారణం మాత్రం.. రవిదాస్ జయంతియే కారణంగా చెబుతున్నారు.. ఫిబ్రవరి 16వ తేదీన రవిదాస్ జయంతి ఉండగా.. ఈ సందర్భంగా లక్షలాది మంది పంజాబీలు ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది.. […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. వివిధ ప్రాంతాల్లో కోవిడ్ విస్తరణ పరిస్థితులను ఈ సందర్భంగా సీఎంకు వివరించారు అధికారులు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న అధికారులు.. అన్ని జిల్లాల్లో కలిపి 53,184 పడకలు సిద్ధంగా ఉన్నాయని.. రాష్ట్రంలో దాదాపు 27వేల యాక్టివ్ కేసుల్లో కేవలం 1100 మంది మాత్రమే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. వీరిలో ఆక్సిజన్ అవసరమైన వారి సంఖ్య సుమారు 600 మంది మాత్రమే అన్నారు.. సుమారు […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది… వరుసగా రాజకీయ నేతలు, సినీ ప్రముఖులకు కూడా కరోనా సోకుతూనే ఉంది.. ఇప్పటికే పలువురు పొలిటికల్ లీడర్లు, అధికారులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే కాగా.. తాజాగా, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు కోవిడ్ సోకింది.. ట్విట్టర్ ద్వారా స్వయంగా ఈ విషయాన్ని నారా లోకేష్ వెల్లడించారు.. తనకు కరోనా పాజిటివ్‌గా తేలింది.. కోవిడ్ లక్షణాలు లేకున్నా.. పాజిటివ్‌గా వచ్చిందన్నారు.. తాను ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నానని ట్విట్టర్లో వెల్లడించిన […]
కరోనా మరోసారి పంజా విసురుతోంది.. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను కూడా కరోనా వైరస్ పలకరించింది.. తాజాగా, తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. స్వల్ప లక్షణాలతో బాధపడుతోన్న ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా వచ్చింది.. అయితే, ఎటువంటి సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఏజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. […]
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోన్న సమయంలో.. మళ్లీ కఠిన ఆంక్షలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ సూచనలతో ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్‌పై తాజా పరిస్థితులపై చర్చించిన ఆయన.. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇదే సమయంలో.. […]
కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతోన్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది… విద్యా సంస్థలకు సెలవులు పొడిగించాలని నిర్ణయానికి వచ్చింది.. రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు ఇవాళ్టితో ముగియనుండగా.. రేపటి నుంచి స్కూళ్లు, విద్యాసంస్థలు ప్రారంభం కావాల్సి ఉంది.. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజులు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.. వాటిని నిజం చేస్తూ.. ఈ నెల 30వ తేదీ వరకు విద్యా సంస్థల […]
రాజధాని హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నట్టుండి భారీ వర్షం కురిసింది.. కొన్ని ప్రాంతాల్లో 14 సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది.. నల్లగొండ, సూర్యాపేట, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి… అత్యధికంగా సూర్యాపేట జిల్లా ఎర్కరాంలో 14.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో 11.7 సెంటీ మీటర్లు, మేడ్చల్ జిల్లా కాప్రాలో 11.6 సెం.మీ., రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో 9 సెం.మీ. నమోదు అయ్యింది.. […]
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.. ఓవైపు అధికార బీజేపీ, మరోవైపు ప్రతిపక్ష ఎస్పీ.. ఇంకో వైపు కాంగ్రెస్, మరోవైపు బీఎస్పీ ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.. అయితే, అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. అందేంటి? బీజేపీకి వరుసగా షాక్‌లు ఇస్తూ.. మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తూ.. ఎస్పీ గూటికి క్యూ కడుతోన్న సమయంలో.. అఖిలేష్ యాదవ్.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు […]