కట్టుకున్న భార్యకు అన్నీ తానై చూసుకోవాల్సిన భర్త సైకో ప్రవర్తనతో.. ఓ ఇల్లాలికి నరకం చూపించాడు.. పెళ్లి జరిగినప్పటి నుంచి వికృత వేధింపులకు పాల్పడ్డాడు.. మౌనంగా దాదాపు రెండేళ్లు ఆ సైకోగాడిని భరించిన ఆమె.. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాళహస్తికి చెందిన పోలయ్య 2020 మార్చి 5వ తేదీన వివాహం చేసుకున్నాడు.. ఇక, కొంతకాలం నుంచి తీవ్ర వేధింపులకు దిగాడు.. ఓ వైపు అనుమానం, వికృత వేధింపులు. చిత్రహింసలు, బావతో పడక పంచుకోమని ఒత్తిడి.. ఇలా ఎన్నో రకాలుగా.. మానసికంగా.. శారీరకంగా వేధింపులకు గురిచేశాడు.
Read Also: Ukraine Russia War: ముగిసిన యుద్ధం.. రష్యా కీలక ప్రకటన
అయితే, చాలా కాలం ఆ సైకోగాడి వేధింపులు మౌనంగా భరించిన ఆమె.. ఎస్పీ వెంకటప్పల నాయుడుకి మీతో మీ ఎస్పీ-స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.. ఆ వేధింపులు భరించలేకపోతున్నా.. ఆ ఇంటిలో బతకలేను.. దయచేసి నాకు అతనితో విడాకులు ఇప్పించాలని మొరపెట్టుకున్నారు.. నాకు ఆ నరక కూపం నుంచి విముక్తి కలిగించండి అంటూ ఎస్పీని వేడుకుంది.. నా భర్త తన అన్న పక్కన పడుకోవాలని చెప్పడం… తల్లిదండ్రుల స్థానంలో చూడవలసిన అత్తమామలు శారీరకంగా చిత్రహింసలకు గురిచేయడం నేను తట్టుకోలేకపోతున్నాను.. భరించలేకపోతున్నాను అంటూ గోడు వెల్లబోసుకుంది.. ఇక, ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఎస్పీ వెంకటప్పల నాయుడు.. కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు.