రెండోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యోగి ఆదిత్యానాథ్.. 52 మంది మంత్రులతో కూడా ప్రమాణస్వీకారం చేయించారు.. అయితే, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఉచిత రేషన్ పథకాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ.. రెండో టర్మ్‌లో తొలి నిర్ణయం తీసుకున్నారు యోగి. ముఖ్యమంత్రి యోగి నేతృత్వంలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చారు. దీంతో.. రాష్ట్రంలో మొత్తం 15 కోట్ల మందికి లబ్ధి పొందనున్నారు.. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రారంభించిన ఉచిత రేషన్ పథకం గడువు మార్చితో ముగియాల్సి ఉండగా.. దానిని మరో 3 నెలలు పొడిగించారు..
Read also: AP Budget: యనమల సంచలన ఆరోపణలు..
యూపీలో మూడు నెలల పాటు ఉచిత రేషన్ ఇస్తామని.. పేదలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ప్రజలకు చేరవేయాలని కొత్త ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ అన్నారు. కాగా, యూపీలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడానికి ఉచిత రేషన్ పథకం కీలక భూమిక పోషించినట్టు పలు విశ్లేషణలు పేర్కొన్నాయి.. అలాంటి పథకాన్ని మరువకుండా.. మరో మూడు నెలలు పొడిస్తూ నిర్ణయం తీసుకున్న సీఎం యోగి ఆదిత్యానాథ్… పేద ప్రజలకు శుభవార్త చెప్పారు.