ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు.. రూ. 48 వేల కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించిన ఆయన.. రూ. 48 వేల కోట్ల దుర్వినియోగంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పులు – అవివీతి తప్ప మరేం జరగలేదన్న ఆయన.. ప్రభుత్వం చెప్పుకున్న స్థాయిలో సంక్షేమానికి పెద్దగా ఖర్చు పెడుతోందేంలేదన్నారు.. కోర్టుల తీర్పులపై సభలో చర్చలు పెడుతున్నారు. ఉభయ సభలను వాళ్ల సొంతానికి వాడుకుంటున్నట్టు కన్పిస్తోందని.. కోర్టులను, చట్ట సభలను కూడా చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు.. రూ. 48 వేల కోట్ల ఖర్చులకు సంబంధించిన లెక్కలు లేవని కాగ్ చెప్పిందని గుర్తుచేసిన ఆయన.. రూ. 1.78 లక్షల కోట్లు ఖర్చు పెడితే రూ. 48 వేల కోట్లకు లెక్కల్లేవని.. రూ. 48 వేల కోట్లు నిధులు పక్కదారి పట్టాయని.. ప్రజల కోసం రూ. 48 వేల కోట్లు ఖర్చు పెడితే లెక్కలు ఎందుకు చెప్పలేకపోయారంటూ నిలదీశారు.. ఆ రూ. 48 వేల కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందని ఆరోపించిన యనమల.. మా లెక్క ప్రకారం రూ. 48 వేల కోట్ల కంటే ఎక్కువగానే దోపిడీ జరిగిందన్నారు.
Read Also: AP Cabinet: కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు..!
ఇక, రూ. 48 వేల కోట్ల ఖర్చుకు సంబంధించి స్పెషల్ బిల్లులు పేరుతో ఖర్చు పెట్టామని ప్రభుత్వం చెబుతోందన్నారు యనమల రామకృష్ణుడు.. స్పెషల్ బిల్లులనేవి ట్రెజరీ కోడ్‌లోనే లేదన్న ఆయన.. రూ. 48 వేల కోట్లు ప్రజలకు ఖర్చు పెట్టిఉంటే పేదలకు మరింత మేలు.. లబ్ది జరిగేదన్నారు.. భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జరుగుతోంది కాబట్టి కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న ఆయన.. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ సుమారు రూ. లక్ష కోట్లు తెచ్చారు.. దానికి సంబంధించిన లెక్కలు చెప్పలేదని.. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ లెక్కలు కూడా బడ్జెట్ లెక్కల్లో చూపాలని 15వ ఆర్ధిక సంఘం సిఫార్సు చేసింది.. 2024 నాటికి రూ. 8-9 లక్షల కోట్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.. రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు విపరీతంగా పెరుగుతోంది.. ఏపీ విషయంలో కేంద్రం ఆర్టికల్ 360 అమలు చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్ర ప్రజల కోసం.. ఆర్థిక పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాలన్నారు.. రూ. 48 వేల కోట్ల దుర్వినియోగంపై పూర్తి స్థాయి విచారణ జరపాలి.. రూ. 48 వేల కోట్ల దుర్వినియోగంపై సీబీఐతో విచారణ చేయించాలి.. ప్రభుత్వం ఎందుకు లెక్కలు చెప్పలేకపోతోంది..? ఎవరి జేబుల్లోకి వెళ్లిందో లెక్క తేల్చాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకోవాలని సూచించిన మాజీ ఆర్థికశాఖ మంత్రి.. రాష్ట్ర ఆదాయాన్ని ప్రభుత్వ పెద్దలు దిగమింగుతున్నారని విమర్శించారు.
స్పెషల్ బిల్లులనే ప్రొవిజన్ లేకుండానే ఖర్చు పెట్టేశారని వ్యాఖ్యానించిన యనమల.. దాణా స్కామును కూడా కాగ్ నివేదికే బయటపెట్టిందని.. కాగ్ నివేదిక ఆధారంగానే విచారణ చేశారు.. స్కామ్ జరిగిందని తేల్చారని.. ఏపీలోని రూ. 48 వేల కోట్ల దుర్వినియోగం జరిగిందని కాగ్ నివేదికే బయటపెట్టిందని.. స్పెషల్ బిల్లుల పేరుతో నిధులు మళ్లించేందుకే సీఎఫ్ఎంఎస్ విధానం లోపభూయిష్టం అనే ప్రచారం మొదలు పెట్టారన్నారు. జగన్ ప్రభుత్వంలో పీఏసీ వ్యవస్థ ఎందుకు సరిగా పని చేయడం లేదు..? అని ప్రశ్నించిన యనమల.. పీఏసీ జరగనివ్వకుండా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. చట్టాలు చేసే అధికారం లేదని కోర్టులు చెప్పకున్నా.. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.. చట్టాలు చేసే హక్కు చట్టసభలకు లేదని కోర్టు చెప్పలేదని.. మూడు రాజధానుల పైనే చట్టం చేసే అధికారం లేదని మాత్రమే హైకోర్టు చెప్పిందన్నారు.