తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పైకి కదులుతూనే ఉన్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,447 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 2,295 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 7,11,656కు చేరుకోగా.. రికవరీ కేసులు 6,85,399కు పెరిగాయి.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి […]
మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల పని వేళలను మరో గంట పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్… ప్రభుత్వ మద్యం దుకాణాల్లో రాత్రి 10 గంటల వరకు తెరుచుకునే వెసులుబాటు కల్పించింది… మద్యం సేల్స్ అకౌంట్ల నిర్వహణకు మరో గంట సమయాన్ని పెంచినట్టు ప్రభుత్వం పేర్కొంది.. రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మద్యం దుకాణాలకు వెసులుబాటు […]
తెలంగాణ మంత్రి కేటీఆర్, ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా.. ఇద్దరూ ఇద్దరే… సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ.. అన్ని సమస్యలపై స్పందిస్తుంటారు.. వీరి పోస్టులు ఓసారి ఆలోచింపజేస్తే.. మరోసారి నవ్వు పెట్టిస్తాయి.. ఇంకోసారి పెట్టుబడులు తెస్తాయి.. మరికొన్ని సార్లు కొత్త ప్రాజెక్టులకు అడుగులు వేస్తాయి.. అయితే, సోషల్ మీడియా వేదికగా.. ఒకరికొరరు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.. దానికి ప్రధాన కారణం మాత్రం.. ‘ఫార్ములా ఈ’గానే చెప్పాలి.. ప్రతిష్టాత్మక ‘ఫార్ములా ఈ’ వరల్డ్ ఛాంపియన్షిప్ […]
కరోనా కేసుల విజృంభణ మళ్లీ కొనసాగుతుండడంతో.. అంతా ఆన్లైన్ బాట పడుతున్నారు.. ఇప్పటికే ఈ నెల 30వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో.. ప్రైవేట్ విద్యా సంస్థలు ఇవాళ్టి నుంచే ఆన్లైన్ బోధనను తిరిగి ప్రారంభించాయి.. మరోవైపు.. న్యాయస్థానాల విధుల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ హైకోర్టు.. రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో వెంటనే అన్ని కేసులను ప్రత్యక్ష విచారణ నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. […]
తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలకు మద్దతు ఇవ్వండి.. అవి దేశ వృద్ధి రేటుకు కూడా ఉపయోగడతాయని తెలిపారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగిన గతి శక్తి సౌత్ జోన్ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కేటీఆర్… మాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మాస్యూటికల్స్, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్, పవర్, బొగ్గు రంగాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలను ప్రస్తావించారు.. ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో 35 శాతం హైదరాబాద్‌లోనే జరుగుతోందన్న ఆయన.. భౌగోళిక […]
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ తప్పనిసరి అయిపోయింది.. దీంతో, క్రమంగా అన్ని ఏజ్ గ్రూపులకు వ్యాక్సిన్ వేయడంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది భారత ప్రభుత్వం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కూడా కరోనా టీకాలు వేస్తున్న విషయం తెలిసిందే కాగా.. త్వరలోనే 15 ఏళ్ల లోపు వారికి కూడా టీకాలు వేసేందుకు సిద్ధం అవుతోంది.. ఇవాళ వ్యాక్సినేషన్‌పై మాట్లాడిన జాతీయ కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ ఎన్కే అరోరా… త్వరలోనే […]
తెలంగాణలో విద్యా విధానంపై కొత్త చట్టం తీసుకురావాలని కేబినెట్ సమావేశం నిర్ణయించినట్టు తెలిపారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ మరియు వచ్చేవిద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకై.. కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.. ఈ రెండు అంశాలపై పూర్తి అధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.. Read Also: […]
ఆంధ్రప్రదేశ్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త కిందకు పైకి కదిలినా.. భారీ సంఖ్యలోనే కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 22,882 శాంపిల్స్ పరీక్షంచగా.. 4,108 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. ఇవాళ ఎలాంటి మరణాలు సంభవించలేదు.. ఇక, ఇదే సమయంలో మరో 696 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,18,84,914 కోవిడ్ నిర్ధారణ […]
ఏదైనా స్పెషల్ డే వచ్చిందంటే చాలు.. ప్రత్యేక ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే పనిలోపడిపోతాయి ఈకామర్స్ సంస్థలు.. ఈ పోటీలో ఈ కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ముందు వరుసలో ఉంటాయి.. ఫెస్టివల్ సీజన్, ఇంకా ఏదైనా స్పెషల్ డే వస్తుందంటే.. ముందే భారీ డిస్కౌంట్లతో సేల్స్ ప్రారంభిస్తాయి.. ఇక, రిపబ్లిక్‌డే సందర్భంగా కూడా స్పెషల్ సేల్ జరుగుతోంది.. జనవరి 17 నుంచి ఫ్లిప్ కార్ట్ ‘బిగ్ సేవింగ్ డేస్’, అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’కు వెళ్తున్నాయి.. […]
గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది.. కరోనా మహమ్మారి రాష్ట్రంలో అడుగుపెట్టిననాటి నుంచి గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సేవలు మరువలేనివి.. కనిపించని మహమ్మారిపై ముందుండి పోరాటం చేస్తున్నారు.. గాంధీని కోవిడ్ ఆస్పత్రిగా మార్చి సేవలు అందిస్తోంది ప్రభుత్వం.. ఇదే సమయంలో.. పెద్ద సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది కూడా కోవిడ్ బారినపడుతుండడంతో.. మిగతా వారిలో ఆందోళన మొదలైంది.. తాజాగా.. మరో 120 మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.. వీరిలో 40 మంది […]