Ukraine Russia War: ముగిసిన యుద్ధం.. రష్యా కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ పై నెలరోజులకు పైగా యుద్దోన్మాదంతో రెచ్చిపోతున్న రష్యా, అనూహ్యంగా ఒక కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ పై వార్‌లో తొలి దశ ముగిసిందని తెలిపింది. ఇక తూర్పు డాన్ బాస్ ప్రాంతాలపై దృష్టిసారిస్తామని రష్యన్ మిలటరీ ప్రకటించింది. డొంటెస్క్, లుహాంస్క్ లలో రష్యా అనుకూల తిరుగుబాటు దారుల ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. పూర్తిస్తాయిలో వీటిని ఆక్రమించేందుకు వ్యూహం మార్చింది మాస్కో. ఉక్రెయిన్ ప్రతిఘటనతో విసిరివేసారుతున్న రష్యన్ మిలటరీ, చిన్నచిన్న లక్ష్యాల వైపు అడుగులెయ్యాలని వ్యూహం మారుస్తున్నట్టు కనపడుతోంది. అందులో భాగంగానే, క్రిమియా తరహాలో డాన్ బాస్ ప్రాంతాన్నీ, పూర్తిగా తమ కంట్రోల్ తెచ్చుకునేందుకు ప్లాన్ మార్చింది. ఫస్ట్ ఫేజ్‌లో తమ ప్రధాన లక్ష్యం అసంపూర్తిగా ముగిసిందని రష్యన్ జనరల్ స్టాఫ్ అధిపతి ఒప్పుకున్నారు. అయితే, ఉక్రెయిన్ సైనిక సామర్థ్యాన్ని వీలైనంత వరకు కుదించామన్న రష్యా,ఇక మిగతా ఫోకస్ మొత్తం డాన్ బాస్ పైనేనని తెలిపింది.
Read Also: Traffic Pending Challans: త్వరపడండి.. మిగిలింది 5 రోజులే..
Also Read
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
రాజధాని కీవ్‌కు తూర్పున వున్న పట్టణాలను తిరిగి స్వాధీనం చేసుకుంటోంది ఉక్రెయిన్ సైన్యం. ఎక్కడికక్కడ రష్యా బలగాలను బోర్డర్‌లకు తరిమికొడుతోంది. అటు సౌత్ ఈస్ట్ పోర్ట్ సిటీ అయిన మరియాపోల్ పూర్తిగా ధ్వంసమైంది. పునర్ నిర్మాణానికి ఏళ్లు పడుతుందని మరియాపోల్ మేయర్ చెప్పారు. అటు గతవారం మరియాపూల్ థియేటర్‌పై రష్యా జరిపిన భీకర దాడిలో దాదాపు 300 మంది చనిపోయారని అధికారవర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్-రష్యా సమరం సాగుతున్న సమయంలో, అమెరికా అధ్యక్షుడు యూరప్ పర్యటన పుతిన్ ను మరింత వేడెక్కిస్తోంది. ఇప్పటికే స్లోవేకియా, పోలాండ్, హంగేరి, బల్గేరియాలకు అదనపు దళాలు పంపాలని నాటో నిర్ణయించింది. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామన్నారు బైడెన్. ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన పోలాండ్‌లో తాజాగా పర్యటించారు బైడెన్. అమెరికా సైనికుల స్థావరాన్ని సందర్శించారు. లక్షలాది ఉక్రెయిన్ శరణార్థులను పోలాండ్ అక్కున చేర్చుకుంటోందని అభినందించారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. మరోవైపు ఉక్రెయిన్ పై మరిన్ని దాడులకు తెగబడుతోంది రష్యన్ ఆర్మీ. సెంట్రల్ ఉక్రెయిన్ లోని మిలటరీ కమాండ్ సెంటర్ పై బాంబు దాడి చేసిందని కీవ్ ప్రకటించింది. అటు ఉక్రెయిన్ ను ఆదుకోవాలని ప్రపంచ దేశాలకు విజ్తప్తి చేశారు అధ్యక్షుడు జెలెన్ స్కీ. పుతిన్ కు వ్యతిరేకంగా మాస్కోలో ఆందోళనలు తీవ్రమయ్యాయి.
తాజావార్తలు
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్‌ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!