టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ola Champions Edition: భారతీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola ఎలక్ట్రిక్) నుండి వచ్చిన సూపర్ హిట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా S1 ప్రో+ (Ola S1 Pro+), ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఓలా రోడ్ స్టర్ X+ (Ola Roadster X+) లను ప్రత్యేక ‘ఛాంపియన్స్ ఎడిషన్ (Champions Edition)’ను లాంచ్ చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌ను ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భారత పురుషుల క్రికెట్ జట్టు విజయం సాధించిన సందర్భంగా వీటిని తీసుకువచ్చింది.
ఈ ప్రత్యేక మోడళ్లలో భారత క్రికెట్ జట్టు ప్రేరణతో రూపొందించిన ప్రత్యేకమైన నీలం రంగు (బ్లూ లివరీ) డిజైన్‌ను అందించారు. స్కూటర్, మోటార్‌సైకిల్ బాడీ ప్యానెల్స్ పై ఈ డిజైన్ కనిపిస్తుంది. భారత క్రికెట్ జట్టు ఈ టోర్నమెంట్లో గెలిచిన మూడో టైటిల్ కు గౌరవంగా ఈ ఎడిషన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ ఛాంపియన్స్ ఎడిషన్లో ప్రధానంగా డిజైన్ లో మాత్రమే మార్పులు చేశారు. మెకానికల్ ఫీచర్లు, ఇతర స్పెసిఫికేషన్లు సాధారణ మోడళ్ల మాదిరిగానే ఉన్నాయి.
Also Read
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
Nara Lokesh: ఏపీలో మరో ప్రాజెక్ట్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్.. అధిక సంఖ్యలో ఉద్యోగాలు..
ఓలా S1 Pro+ ఛాంపియన్స్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.54 లక్షల నుండి ప్రారంభం కానుండగా.. Ola రోడ్ స్టర్ X+ ఛాంపియన్స్ ఎడిషన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.09 లక్షలుగా నిర్ణయించారు. ఈ రెండు వాహనాల అమ్మకాలు 2026 ఏప్రిల్ చివరి వరకు కొనసాగుతాయని కంపెనీ తెలిపింది.
ఓలా S1 ప్రో+ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంది. 4 kWh బ్యాటరీ ప్యాక్, 5.2 kWh బ్యాటరీ ప్యాక్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్ లో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ 17.43 bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం 130 కిమీ/గంట వరకు ఉంటుంది. ఇది 0 నుంచి 40 కిమీ వేగాన్ని కేవలం 2.1 సెకన్లలో అందుకుంటుంది. 4 kWh బ్యాటరీతో 242 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తే, 5.2 kWh బ్యాటరీతో 320 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
Pasham Sunil Kumar: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన పెను ప్రమాదం..!
ఇక ఓలా రోడ్ స్టర్ X+ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విషయానికి వస్తే.. ఇది కూడా రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తుంది. ఇందులో 4.5 kWh బ్యాటరీ ప్యాక్, 9.1 kWh బ్యాటరీ ప్యాక్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్‌లోని ఎలక్ట్రిక్ మోటార్ 14.75 bhp పవర్ ఇస్తుంది. ఇంకా దీని గరిష్ట వేగం 125 కిమీ/గంట కాగా.. ఒకసారి చార్జ్ చేస్తే గరిష్టంగా 500 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. ఈ రెండు వాహనాల్లో కూడా కొత్త 4680 భారత్ సెల్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించినట్లు కంపెనీ వెల్లడించింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?